కేవలం ఈ రెండు ఉంటే చాలు ఎలాంటి హెయిర్ ఫాల్ అయినా కంట్రోల్ అవుతుంది!

హెయిర్ ఫాల్.( Hair Fall ) ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని సతమతం చేస్తున్న సమస్య ఇది.

 Best Way To Stop Hair Fall Quickly!,hair Fall, Stop Hair Fall, Rice Water, Green-TeluguStop.com

స్త్రీలే కాదు పురుషుల్లో కూడా ఎంతోమంది హెయిర్ ఫాల్ కారణంగా తీవ్ర వేదనకు గురవుతున్నారు.అందరిలోనూ హెయిర్ ఫాల్ కు ఒకే రకమైన కారణాలు ఉండవు.

పోషకాల కొరత, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్, ధూమపానం, మద్యపానం, పలు రకాల మందుల వాడకం, ప్రెగ్నెన్సీ, కంటినిండా నిద్ర లేకపోవడం, డిప్రెషన్ ఇలా రకరకాల కారణాల వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది.

ఈ సమస్యను అదుపులోకి తెచ్చుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు ప్రయోగాలు చేసి అలసిపోయారా.? ఎంత ఖ‌రీదైన‌ షాంపూ, ఆయిల్ వాడినప్పటికీ ఎలాంటి ఫలితం లభించడం లేదా.? అయితే అసలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే రెండు పదార్థాలు ఉంటే చాలు.ఎలాంటి హెయిర్ ఫాల్‌ అయినా సరే దెబ్బకు కంట్రోల్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెండు పదార్థాలు ఏంటి.? వాటిని జుట్టుకు ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Green Tea, Care, Care Tips, Fall, Latest, Long, Thick-Telugu Health

గ్రీన్ టీ.( Green Tea ) వెయిట్ లాస్ అవ్వాలని భావిస్తున్న ప్రతి ఒక్కరూ తమ డైట్ లో చేర్చుకునే డ్రింక్ ఇది.అయితే వెయిట్ లాస్ కు మాత్రమే గ్రీన్ టీ సహాయపడుతుంది అనుకుంటే పొరపాటే అవుతుంది.ఆరోగ్యపరంగా గ్రీన్ టీ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.అలాగే జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా జుట్టు రాలడాన్ని అడ్డుకోవడంలో గ్రీన్ టీ ఉత్తమంగా హెల్ప్ చేస్తుంది.ఇక మరొకటి రైస్ వాటర్( Rice Water ).

బియ్యం కడిగిన నీరును చాలా మంది పారబోస్తుంటారు.కానీ ఆ వాటర్ మన జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Telugu Green Tea, Care, Care Tips, Fall, Latest, Long, Thick-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసు రైస్ వాటర్ ను వేసుకోవాలి.అలాగే రెండు గ్రీన్ టీ బ్యాగ్స్‌ అందులో వేసి కనీసం ప‌ది నిమిషాల పాటు మరిగించాలి.ఇలా మరిగించిన వాటర్ ను చల్లార బెట్టుకొని ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆ తర్వాత ఈ వాటర్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

గంటన్నర అనంతరం మైల్డ్‌ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్ గా మారతాయి.జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.హెయిర్ ఫాల్‌ ను అడ్డుకోవడంలో రైస్ వాటర్ మరియు గ్రీన్ టీ అద్భుతంగా సహాయపడతాయి.

పైన చెప్పిన విధంగా టోన‌ర్ ను తయారు చేసుకుని వాడితే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube