సమ్మర్ సీజన్ స్టార్ అయింది.అప్పుడే ఎండలు మండిపోతున్నాయి.
మార్చి రెండో వారం నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు.ఎండల తీవ్రత కు ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు.
ఇక వేసవి వచ్చిందంటే బాడీలో హీట్ విపరీతంగా పెరిగి పోతుంటుంది.ఆ వేడి కారణంగా తీవ్రమైన చెమటలు, చెమటయ కాయలు, తలనొప్పి, కళ్ళ మంటలు, మోషన్స్ వంటి రకరకాల సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
అందుకే ఒంట్లో వేడిని తగ్గించుకోవడం ఎంతో ముఖ్యం.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్‌ను తీసుకుంటే హీట్‌ను తగ్గించి బాడీని ఫుల్ కూల్‌గా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో.ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో.
చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసి వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు, రెండు మీడియం సైజ్ పటిక బెల్లం ముక్కలు, మూడు ఏలకులు, హాఫ్ టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక జార్ తీసుకుని అందులో మూడు గ్లాసుల వాటర్, మిక్సీ పట్టుకున్న పొడి, మొదట నాన బెట్టుకున్న సబ్జా గింజలు, రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్, లైట్‌గా క్రష్ చేసిన పది పుదీనా ఆకులు, నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ టేస్టీ డ్రింక్‌ను గ్లాస్‌లోకి సర్వ్ చేసుకుని సేవించాలి.
రోజుకు ఒకసారి ఈ డ్రింక్‌ను తీసుకుంటే వేడి తగ్గి శరీరం చల్లగా, మెదడు ప్రశాంతంగా మారుతుంది.
తలనొప్పి, ఒత్తిడి, కళ్ళు తిరగడం వంటి సమస్యలు దూరం అవుతాయి.మరియు గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.