తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక పెద్ద ఎత్తున టీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ రకరకాల అంశాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిలో పెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే కాంగ్రెస్ లోసీనియర్ నేతలు అసమ్మతి సెగలు అనేవి ఎప్పటి నుండో కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నా గత రెండు దఫాలుగా అధికారం కోల్పోయినా కాంగ్రెస్ నేతల్లో ఏ మాత్రం మార్పు రానటువంటి పరిస్థితి ఉంది.
అయితే నేడు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రత్యేకంగా పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలపై సమావేశమైన నేపథ్యంలో ఈ విషయం హైకమాండ్ కు చేరడంతో సీనియర్ నేతలపై అధిష్టానం గుస్సా అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలు సృష్టించవద్దని అందరూ కలిసి పనిచేస్తేనే రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు దక్కే అవకాశం ఉంటుందని మాణిక్యం ఠాగూర్ వీ హనుమంత రావు ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి వెళ్లనున్న నేతలతో మాణిక్యం ఠాగూర్ ఈ విషయాన్ని స్పష్టం చేసిన పరిస్థితి ఉంది.

అయితే శ్రీధర్ బాబు లాంటి నేతలు పల్లె నిద్ర కార్యక్రమంలో ఉండడంతో సమావేశానికి హాజరు కాలేనని చెప్పటం, గీతారెడ్డి లాంటి నేతలు కూడా ఠాగూర్ సూచనాలతో ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.అయినా కొంత మంది నేతలు ఈ సమావేశానికి హాజరవడంతో రానున్న రోజుల్లో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.అయితే పరోక్షంగా రేవంత్ కు అధిష్టానం ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్టుగా జోరుగా ప్రచారం కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది.