పరీక్షల సీజన్ వచ్చిందంటే చాలు విద్యార్థుల్లో టెన్షన్ మొదలవుతుంది.ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ వస్తాయా అని ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు.
అటు టీచర్లకు మాత్రం అదో పెద్ద తలనొప్పి.వేలల్లో పేపర్లు దిద్దాలి.
అందులోనూ OMR షీట్లు( OMR Sheets ) అంటే ఇంకా చాలా కష్టం.కానీ బీహార్‌లో ఒక టీచర్ మాత్రం దీనికి సూపర్ టెక్నిక్ కనిపెట్టారు.
OMR షీట్లు దిద్దాలంటే మామూలు విషయం కాదు.ఒక్కో పేపర్ తీసుకుని కరెక్టా తప్పా అని చూస్తూ కూర్చుంటే.టైం ఎంత గడిచిపోతుందో తెలీదు.గంటలు కాదు రోజులు కూడా పట్టొచ్చు.
అలాంటి కష్టమైన పనిని ఈ బీహార్ టీచర్( Bihar Teacher ) మాత్రం చిటికెలో చేసేస్తున్నారు.ఆయన కనిపెట్టిన టెక్నిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీహార్‌లోని ఒక స్కూల్లో తీసిన వీడియో ఇది.టీచర్ ఎంత ఈజీగా OMR షీట్లు చెక్ చేస్తున్నారో చూడండి.ఒక్కో పేపర్ విడివిడిగా చూడకుండా.ఒక చిన్న కటౌట్ లాంటిది వాడతారు.అది మామూలు కటౌట్ కాదు.OMR షీట్ సైజులో ఉంటుంది.
అందులో కరెక్ట్ ఆన్సర్లు ఎక్కడ ఉండాలో అక్కడ రంధ్రాలు ఉంటాయి.
ఇప్పుడు అసలు టెక్నిక్ ఏంటో చూడండి.స్టూడెంట్ రాసిన OMR షీట్‌ను కటౌట్ కింద పెడతారు.అంతే, రంధ్రాలు ఉన్న చోట సమాధానం ఉందా లేదా అని చూస్తారు.
ఉంటే కరెక్ట్, లేకపోతే రాంగ్.సింపుల్ టెక్నిక్, ఇలా చకచకా.
క్షణాల్లో పేపర్ దిద్దేస్తున్నారు.
@pintu అనే ఇన్‌స్టా యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేయగానే వైరల్( Viral Video ) అయిపోయింది.29 లక్షల వ్యూస్ అంటే మామూలు విషయం కాదు.కామెంట్ సెక్షన్లో అందరూ టీచర్‌ను పొగిడేస్తున్నారు.
OMR షీట్లు దిద్దడానికి చాలా టైం పట్టేదని, కానీ ఈ “నింజా టెక్నిక్”తో పని చాలా సులువైపోయిందని టీచర్ స్వయంగా చెప్పారు.నిజంగానే కదా, టెక్నిక్ మాత్రం సూపర్ ఉంది.