డెలివరీ తరువాత తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

డెలివరీ తరువాత కేవలం తమ అరోగ్యాన్ని మాత్రమే కాదు, పుట్టిన పసికందు అరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోని ఆహారాన్ని తీసుకోవాలి.తల్లి తీసుకున్న తిండే, పాపకు అందుతుంది.

 Foods To Be Eaten By Moms After Delivery-TeluguStop.com

పాలు పట్టాలి కాబట్టి, పాల ఉత్పత్తిని పెంచే ఆహారాలు, పోషకాలు ఎక్కువ ఉండే అహారాన్ని తోసుకోవాలి తల్లులు.అవేంటో ఇప్పుడు చూద్దాం.

మంచినీళ్ళు :

పాలుపట్టే తల్లులు డిహైడ్రేట్ అవకూడదు.హైడ్రేటెడ్ గా ఉండాలి అంటే మంచినీళ్ళు బాగా తాగాలి.

పండ్లరసాలు కూడా తోసుకోవాలి.ఇక టీ, కాఫీ లాంటివి కూడా ద్రవ పదార్థాలే కదా అని ఎక్కువ తాగేయొద్దు.

గ్రీన్ వెజిటబుల్స్ :

పాలు పట్టే తల్లులకు ఐరన్ చాలా అవసరం.కాబట్టి ఆకుకూరలు, బీన్స్, మెంతి వంటి గ్రీన్ వెజిటబుల్స్ ని డైట్ లో చేర్చుకోవాలి.

కోడిగుడ్డు :

కోడిగుడ్డుని కూడా డైట్ లో చేర్చుకోవాలి.గుడ్డు శరీరానికి అవసరమైన ప్రొటీన్స్ ను అందజేస్తుంది.

అయితే మీరు తినాల్సింది ఆమ్లేట్ మాత్రం కాదు.ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవడం మంచిది.

నారింజ :

డిలివరి అయిన మహిళలకి విటమిన్ సి చాలా అవసరం.ఇది నారింజలో బాగా లభిస్తుంది.

నారింజతో పాటు ఇతర సిట్రస్ పండ్లను తినాలి.తినడానికి బద్ధకంగా ఉంటే జ్యూస్ చేసుకోని తాగాలి.

బ్రౌన్ రైస్ :

బరువు త్వరగా తగ్గిపోదామని ఆరాటపడొద్దు.పాల ఉత్పత్తి తగ్గిపోతుంది అలా చేస్తే.

బ్రౌన్ రైస్ కూడా డైట్ లో చేర్చుకోవాలి.ఇది శరీరానికి అవసరమైన క్యాలరీలు తెచ్చిపెట్టి, పాల ఉత్పత్తిని పెంచుతుంది.

ఇవి మాత్రమే కాదు, నిమ్మరసం, బ్లూ బెర్రిస్, చికెన్, చేపలు, బాదాం, వాల్ నట్స్, మజ్జిగ, ఉసిరి లాంటివి కూడా పాలు పట్టే తల్లులకు, పాలు తాగుతున్న పసివాళ్ళకు మంచివి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube