ఓదెల2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాల ఫ్లాప్ కు అతనే కారణమా.. అసలేమైందంటే?

ఒక సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవాలి అంటే సినిమాలోని అన్ని సన్నివేశాలు కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి.నతీర్ నటుల నటన నుంచి కథ వరకు ప్రతి ఒక్కటి బాగుండాలి.

 Same Mistake In Arjun Son Of Vyjayanthi And Odela 2 Movies Details, Arjun Son Of-TeluguStop.com

అప్పుడే అలాంటి సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడతారు.ముఖ్యంగా కమర్షియల్ సినిమాలు, హర్రర్ సినిమాల విజయంలో సినిమాటోగ్రఫీ సంగీతం ప్రధాన పాత్రలు పోషిస్తాయని చెప్పాలి.

టాలీవుడ్‌ లోని దర్శక నిర్మాతలు ఈ రెండు క్రాఫ్ట్స్‌కి సంబంధించి ఇతర భాషలకు చెందిన టెక్నీషియన్స్‌ పైనే మొగ్గు చూపుతుంటారు.వేరే భాషలో ఏదైనా సినిమా సూపర్‌ హిట్‌ అయితే ఆ టెక్నీషియన్స్‌ ని టాలీవుడ్‌ కి దిగుమతి చేసుకుంటారు.

ఇటీవలి కాలంలో ఇతర భాషల్లోని సినిమాటోగ్రాఫర్లకు, సంగీత దర్శకులకు టాలీవుడ్‌ లో డిమాండ్‌ బాగా పెరిగిందని చెప్పాలి.

Telugu Arjunson, Kalyan Ram, Kantara, Mangalavaaram, Musicajaneesh, Odela, Taman

2009లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా కన్నడలో పరిచయమైన అజనీష్‌ లోకనాథ్‌( Ajaneesh Loknath ) అక్కడ ఎన్నో సినిమాలకు సంగీతం అందిచి మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.మ్యూజికల్‌ గా చాలా సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి.వాటిలో విక్రాంత్‌ రోనా, కాంతార వంటి భారీ చిత్రాలు కూడా ఇందులో ఉన్నాయి.

అలాగే కిరిక్‌ పార్టీ అనే చిన్న సినిమా కూడా ఉంది.ఆ సినిమాను తెలుగులో కిరాక్‌ పార్టీగా రీమేక్‌ చేసినపుడు అతన్నే మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా  టాలీవుడ్‌ లో పరిచయం చేశారు.

తర్వాత నన్ను దోచుకుందువటే చిత్రానికి కూడా సంగీతం కూడా అందించారు.ఆ సినిమా తర్వాత నాలుగు సంవత్సరాల పాటు తెలుగులో మరో సినిమా చేయలేదు అజనీష్‌.2022లో కన్నడలో రూపొందిన కాంతార( Kantara ) చిత్రంతో మరోసారి అజనీష్‌ లైమ్‌లైట్‌ లోకి వచ్చాడు.

Telugu Arjunson, Kalyan Ram, Kantara, Mangalavaaram, Musicajaneesh, Odela, Taman

ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై ఘనవిజయం సాధించింది.దీంతో తెలుగు మేకర్స్‌ అతనితో మళ్ళీ సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపించారు.అలా విరూపాక్ష, మంగళవారం చిత్రాలకు సంగీతం అందించాడు.

ఈ రెండు సినిమాలు మ్యూజికల్‌గా కూడా మంచి విజయం సాధించాయి.ముఖ్యంగా ఈ సినిమాలకు అతను చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి చాలా మంచి పేరు వచ్చింది.

తమ సినిమాలకు అజనీష్‌ మ్యూజిక్‌ మంచి ప్లస్‌ అవుతుందని భావించిన మేకర్స్‌ ఇటీవల విడుదలైన ఓదెల2,( Odela 2 ) అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి( Arjun Son Of Vyjayanthi ) చిత్రాలకు సంగీతం అందించే బాధ్యతను అతనికి అప్పగించారు.అజనీష్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా చేస్తాడని పేరుంది.

సినిమా అంటే బిజిఎం ఒక్కటే కాదని, పాటలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండాలనే విషయం అందరికీ తెలిసిందే.ఈ రెండు సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగానే చేసినా పాటల విషయంలో మాత్రం అతను ఫెయిల్‌ అయ్యాడు.

ఒకరోజు తేడాతో విడుదలైన ఓదెల2, అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి చిత్రాల్లో ఒక్క పాట కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.వరసగా విడుదలైన రెండు సినిమాల్లోని పాటలు సూపర్‌ హిట్‌ చెయ్యలేకపోవడంతో అజనీష్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అలా ప్రేక్షకులు ఈ సినిమాలు విడుదల అయ్యి సక్సెస్ కాకపోవడానికి అతనే కారణం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube