గ్రీన్ టీ.ఒకప్పుడు దీని గురించి పెద్దగా తెలియదు.
కానీ, ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తీసుకునే పానియాల్లో గ్రీన్ టీ కూడా ఒకటిగా మారింది.ఆరోగ్యంగా ఉండడానికి, ఫిట్‌గా ఉండడానికి గ్రీన్ టీ తీసుకుంటుంటారు.
మిగిలిన టీలతో పోల్చితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.అలాగే అమినో యాసిడ్స్, మ్యాంగనీస్, విటమిన్ బి వంటి ఇతర న్యూట్రీషియన్స్ కూడా అధికంగానే ఉంటాయి.
ఇవి ఆరోగ్యాన్ని కాపాడడంలో తోడ్పడతాయి.
అయితే గ్రీన్ టీతో చర్మ సౌందర్యాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు.
గ్రీన్ టీలో ఉండే సౌందర్య రహస్యాలు చర్మం కాంతివంతంగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.మరి దీన్ని చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమలు, మచ్చలు తగ్గించడంలో గ్రీన్ టీ గ్రేట్‌గా సహాయపడుతుంది.అందుకే గ్రీన్ టీ లో కొద్దిగా నిమ్మరసం కలిపి.
అందులో కాటన్ బాల్ డిప్ చేసి ముఖానికి అప్లై చేయాలి.
పది నిమిషాల పాటు ఆరనిచ్చి.
అనంతరం క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేయడం వల్ల గ్రీన్ టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను, మచ్చలను తగ్గిస్తుంది.
మరియు కళ్ల కింద నల్లటి వలయాలను కూడా తగ్గింది.అలాగే ప్రతిరోజు గ్రీన్ టీతో ముఖం కడుక్కుంటే.
ఇది చర్మంలోని మలినాలను తొలగించి చర్మరంధ్రాలను శుభ్రపరుస్తుంది.ముఖాన్ని ఫ్రెష్‌గా, కాంతివంతంగా మెరుస్తుంది.
గ్రీన్ టీ పౌడర్‌లో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి.పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై మురికి, ట్యాన్ తొలుగుతుంది.అలాగే జిడ్డును తగ్గించి మెరిసే చర్మాన్ని అందిస్తుంది.
అదే సమయంలో చర్మంపై ఉన్న ముడతలను తగ్గించి.యవ్వనంగా మారుస్తుంది.