తమిళ హీరో విశాల్( Vishal ) హీరోగా నటించిన చిత్రం మదగజరాజ.( Madha Gaja Raja ) అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం ఈ సినిమా పూర్తి అయినప్పటికీ చాలా ఆలస్యంగా 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు విడుదలైన విషయం తెలిసిందే.
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా 60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇక తమిళంలో మంచి సక్సెస్ అవడంతో అదే ఊపుతో తెలుగులో కూడా విడుదల అయింది.కానీ తెలుగులో ఆశించిన స్థాయిలను ఫలితాలను రాబట్టలేకపోయింది.
ముఖ్యంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఈ సినిమాకు తెలుగులో పరిస్థితి చాలా భిన్నంగా కనిపించింది.

విశాల్ తెలుగు ప్రమోషన్స్ సమయంలో దూరంగా ఉండడం వరలక్ష్మి శరత్ కుమార్( Varalaxmi Sharath Kumar ) అంజలి( Anjali ) అంతంత మాత్రం గానే ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతో ఇది ఈ సినిమాకు పెద్ద మైనస్ గా మారింది.దానికి తోడు రొటీన్ కథ కావడంతో సినిమాకు కూడా టాక్ పెద్దగా రాలేదు.పొంగల్ సెలవుల కారణంగా తమిళంలో ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది.కానీ తెలుగులో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.పాతకాలం నాటి కథ కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు.కామెడీ కొంతలో కొంత నవ్వించినా సినిమాను కాపాడలేకపోయింది.

సంక్రాంతి సినిమాల హడావుడిలో మదగజరాజ హైప్ తెచ్చుకోలేకపోవడం కూడా ప్రభావం చూపింది.మణివణ్ణన్ మనోబాల వంటి నటులున్నా కథ పాతది కావడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు.కమర్షియల్ అంశాలున్నా కథలో కొత్తదనం లేకపోవడంతో సినిమా నిరాశపరిచింది.మొత్తంగా చూసుకుంటే హీరో విశాల్ కు తెలుగు ప్రేక్షకులు ఊహించని షాక్ ఇచ్చారని చెప్పాలి.గతంలో విశాల్ నటించిన చాలా సినిమాలు తెలుగులోకి విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమాపై హీరో అలాగే మూవీ మేకర్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.
కానీ ఆ అంచనాలను తలకిందులు చేసేసారు తెలుగు ప్రేక్షకులు.