వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్.స్టార్ హీరోలు అందరూ కూడా ఇదే కావాలి అని అంటున్నారు.
ఒకవైపు కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూనే అదే కథలో అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ ఉండాలని భావిస్తున్నారు.ఇక ఇలాంటి యాక్షన్ ఎలివేషన్స్ ఉంటే ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడం ఖాయమని భావిస్తున్నారు.
ఇటీవలే గూస్బంప్స్ తెప్పించే వైలెన్స్ తో రాఖీ బాయ్ ఇండియన్ బాక్సాపీస్ వద్ద ఎంతో సెన్సేషన్ సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.
యాక్షన్ సన్నివేశాలు ఆరడుగుల మహానుభావుడూ ఆరుపలకల దేహం ఉంటే బాగుంటుంది అనుకుంటారు.కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ ఇలాంటి పోలికలతోనే యాక్షన్ ఎలిమెంట్స్ కేరాఫ్ అడ్రస్ గా ఉన్నాడు ప్రభాస్.ఇటీవలే యాక్షన్ లేని రాధేశ్యాం లవ్ స్టోరీ తో ప్రేక్షకులను నిరాశ పరిచాడు.
ఇక ఇప్పుడు ప్రశాంత్ నిల్ ప్రభాస్ కాంబినేషన్లో సలార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్ లాంటి సినిమాల్లో కూడా హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ప్రస్తుతం వినిపిస్తున్న మాట.ఇక త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన చరణ్ శంకర్ సినిమా లో భారీ యాక్షన్ తో అదరగొట్టపోతున్నాడని తెలుస్తోంది.
నేనేమీ తక్కువ కాదు అన్నట్లుగానే తారక్ కూడా యాక్షన్ మేనియా మంత్రాన్నే జపిస్తూ ఉన్నాడు.ఇక సుకుమార్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్ తో ఎలా అదరగొట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక మరోవైపు సర్కారు వారి పాట సినిమాలో అందాల రాకుమారుడు మహేష్ బాబు యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయబోతున్నాడట.
ఇక రాజమౌళి తో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది.ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.ఇక బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ షారుక్ ఖాన్ లాంటి వాళ్లు కూడా యాక్షన్ మంత్రాన్ని జపిస్తూ వుండడం గమనార్హం.