హీరో అజిత్ కార్ రేసింగ్ మానేయ్యడానికి వెనక ఇంత కథ నడిచిందా ?

హీరో అజిత్ సినిమా ఇండస్ట్రీ కి రావడానికి ముందు కార్ రేసర్ అనే విషయం మన అందరికి తెలిసిందే.అయితే చాల మంది హీరోలు సినిమాల్లోకి రావడానికి ముందు ఎదో ఒక హాబీ పెట్టుకుంటారు.

 Why Hero Ajith Left Car Racing , Hero Ajith  ,ajith Left Car Racing ,formula 2 R-TeluguStop.com

లేదంటే ఎదో ఒక ఆటలో నిష్ణాతులు అయ్యి ఉంటారు.కానీ అజిత్ సాధారణ పరిస్థితులను అధిగమించి దేశంలోనే ఒక అత్యుత్తమైన ఫార్ములా 2 రేసింగ్ డ్రైవర్ పేరు సంపాదించుకున్నాడు.

అంత స్థాయికి దూసుకెళ్లిన వారెవ్వరూ కూడా రేసింగ్ వదిలేసి సంబంధం లేని ఫీల్డ్ కి వచ్చి కష్టాలు పడాలని అనుకోరు.కానీ అజిత్ కి అలాంటి కొన్ని అసాధారణ సంఘటనలు జరిగాయి కాబట్టి అజిత్ కార్ రేసింగ్ నుంచి దూరం అయ్యాడు.

మరి ఆ సంఘటనలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.అజిత్ చదువుకుంటున్న రోజుల్లోనే కాలేజీ డ్రాప్ చేసి రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ లో మెకానిక్ చేరాడు.ఆ తర్వాత ఏవో కొన్ని బిజినెస్ లు చేసిన అవి ఏవి వర్క్ అవుట్ అవ్వలేదు.ఆ టైం లోనే రేసింగ్ పై ఆసక్తి పెంచుకున్నాడు అజిత్.

Telugu Ajith Car, Formula, Ajith, Formula Race, Royalenfield, Officials-Telugu S

ఆ క్రమం లోనే అనేక ఫార్ములా 2 రేసింగ్ పోటీల్లో పాల్గొన్నాడు.అయితే ఒకసారి రేసు జరుగుతున్న టైం లో చాల పెద్ద ప్రమాదం జరిగింది దాంతో చాల రోజుల పాటు అయన మంచానికే పరిమితం అయ్యాడు.కానీ ఆ తర్వాత కోలుకొని మళ్లీ రేసింగ్ చేయడం మొదలు పెట్టాడు.అయితే ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా ఏ రోజు రేసింగ్ వదలాలని అజిత్ అనుకోలేదు.

Telugu Ajith Car, Formula, Ajith, Formula Race, Royalenfield, Officials-Telugu S

కానీ ఒకసారి ప్రెస్టీజియస్ ఫార్ములా 2 రేసులో గెలిచి ఇండియాకు తిరిగి వచ్చిన అజిత్ ఎయిర్ పోర్ట్ లో దిగేసరికి ఒక్కరు కూడా సదరు స్పోర్ట్స్ అధికారులు ఎవ్వరు రిసీవ్ చేసుకోవడానికి రాలేదు.దేశానికి ఇంత మెడల్ సాధించిన కూడా ఎలాంటి ఘనత దక్కకపోవడం, అలాగే ఎవరు ప్రాధాన్యత ఇవ్వకపోవడం తో అజిత్ బాగా హర్ట్ అయ్యాడు.అందుకే ఇక రేసింగ్ లో పాల్గొనడం వలన తనకు ఎలాంటి ప్రయోజనం లేదు అని భావించి అదే సమయం లో మోడలింగ్ ఏజెన్సీలు అజిత్ ని మోడల్ గా సంప్రదించడం తో అటు వైపుగా అడుగులు వేసాడు.అక్కడ నుంచి చిన్న హీరో గా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టి ఈ రోజు సౌత్ ఇండియాలోనే పెద్ద స్టార్ గా ఎదిగాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube