నిమ్మకాయ( Lemon ) మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా నిమ్మకాయతో ఆ దీక్షను విరమిస్తే వెంటనే మళ్లీ శక్తిని తిరిగి పొందవచ్చు.
ఇక మన ఇళ్లలో ఉండే ఆహార పదార్థాలలో నిమ్మకాయ ఎంతో ముఖ్యమైనదని దాదాపు చాలా మందికి తెలుసు.ఎందుకంటే మన ఇంట్లో ఉండే నిమ్మకాయను బయట రోడ్డు మీద చూస్తే ఇక ఆ రోజంతా భయపడుతూనే ఉంటారు.
ఇక కొత్త కారును( New Car ) కొనుగోలు చేసినప్పుడు వారు చేసే మొదటి పని ముందు కారు కింద నిమ్మకాయ అనుభవించి దాన్ని తొక్కిస్తూ ఉంటారు.నిమ్మకాయను ఒక రకంగా కాకుండా అన్ని విధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు.

తంత్ర శాస్త్రంలో చెడు కన్ను( Evil Eye ) నివారించడానికి ఇలా ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు.అయితే జ్యోతిష్యంలో నిమ్మకాయను ఎందుకు ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.నిమ్మకాయలు శుక్రుడు మరియు చంద్రునితో సంబంధం కలిగి ఉన్నాయని పండితులు చెబుతున్నారు.నిమ్మకాయ యొక్క పుల్లని రుచి శుక్రుడి తో దాని రసం చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది.
కాబట్టి ఇది రెండిటికి ప్రత్యేకంగా ఉంటుంది.నిమ్మకాయను మీ కొత్త వాహనంతో( New Vehicle ) తొక్కిస్తే చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.
అలాగే మీరు తరచుగా దుకాణాల్లో నిమ్మకాయ మిరపకాయలను వేలాడదీయడం చూస్తూ ఉంటారు.

పురాణ గ్రంధాల ప్రకారం నిమ్మకాయలు, మిరపకాయలను వేలాడదీయడం వల్ల దుష్ట శక్తులు లేదా ప్రతికూలత ప్రవేశించకుండా ఉంటుంది.ఇది మీ పనిని ప్రభావితం చేయదు.దిష్టి కూడా తగలకుండా ఉంటుంది.
నిమ్మకాయ, మిరపకాయలను ఎల్లప్పుడూ ఏడూ ఒకటి క్రమంలో పెట్టి షాపుల దగ్గర( Shops ) పెడుతూ ఉంటారు.అందుకే వాహనాలకు పూజ చేసే సమయంలో, దూర ప్రయాణం చేసే సమయంలో నిమ్మకాయలను ఉపయోగిస్తూ ఉంటారు.
అలాగే వ్యాపారస్తులు వారి వ్యాపారం అభివృద్ధి చెందడానికి కూడా ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు.