తలనీలాలు సమర్పించటంలో గల పరమార్ధం ఏమిటి?

మానవుల జీవితాల్లో కన్నీళ్లు, కష్టాలు ఎదో సమయంలో ఉంటానే ఉంటాయి.కష్టాలు వచ్చినప్పుడు నీవే దిక్కు అంటూ దేవుణ్ణి మొరపెట్టుకోవడం సహజమే.

 The Hindhu Dharama Shastra About Hair For God-TeluguStop.com

ఆపదలు,కష్టాల నుండి గట్టెక్కిస్తే మొక్కులు చెల్లిస్తామని మొక్కుకుంటూ ఉంటారు.అలాంటి మొక్కులలో తలనీలాలు సమర్పించటం అనేది ఒకటి.

కాబట్టి ఆయా పుణ్యక్షేత్రాలలో తలనీలాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా భారీగా ఉంటున్నాయి.

చక్కగా స్వామివారికి కానుకలుగా ఏవైనా సమర్పించకుండా, వెంట్రుకలు ఇస్తామని మొక్కుకోవడమేమిటని చాలా మందికి అనుమానం రావచ్చు.

వెంట్రుకలు ఇవ్వడం వలన స్వామికి ఒరిగేదేముందని భావిస్తుంటారు.అయితే తలనీలాలు ఇవ్వడమనే ఆచారం వెనుక అసలైన అర్థం వుంది.

సాధారణంగా జుట్టు అందానికి … ఆకర్షణకి ప్రతీకగా కనబడుతుంది.ఆకర్షణ వ్యామోహానికి దారితీయడమే కాకుండా, అనుబంధాలను … అందమైన జీవితాన్ని చిందరవందర చేస్తుంది.

జుట్టు లేకపోవడం వలన మనసులో ఎలాంటి వికారాలు కలగవు.కనుక నీతిబద్ధమైన … నియమబద్ధమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఏర్పడుతుంది.

ఇక తల నీలాలు సమర్పించడమంటే, అహంకారాన్ని వదులుకున్నట్టుగా స్వామివారికి చెప్పడమే.ఈ కారణం చేత స్వామివారికి తలనీలాలు సమర్పించటం జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube