ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.03
సూర్యాస్తమయం: సాయంత్రం 05.40
రాహుకాలం: సా.04.15 నుంచి 05.41 వరకు
అమృత ఘడియలు: ఉ.08.45 నుంచి 09.15 వరకు
దుర్ముహూర్తం: సా.04.06 నుంచి 04.52 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈ రోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి.కుటుంబానికి మీరు వెన్నెముకగా ఉండాలి.వీలైనంత వరకు వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.
ఈ రోజు మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు.మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది.
కెరీర్ లో ముందుకు వెళ్లడానికి అవకాశాలు ఉన్నాయి.వ్యాపారంలో సహోద్యోగుల సలహాల వలన ముందడుగు వస్తారు.
వృషభం:

ఈ రోజు మీకన్నీ కలిసొస్తాయి.వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతారు.అంతేకాకుండా సమాజంలో మీకంటూ మంచి గుర్తింపు వస్తుంది.నూతన వ్యక్తులతో పరిచయాలు చేసుకుంటారు.కుటుంబంతో అందరితో కలవడిగా ఉంటారు.అవసరమైన పనుల్లో పాల్గొంటారు.
కొన్ని కారణాల మూలంగా శారీరక, మానసికంగా బాధ పడతారు.మీరు ఎంచుకున్న అత్యున్నత రంగానికి చేరుకుంటారు.
మిథునం:

ఈ రోజు ఈ రాశి వారికి సంపద, బలం కూడా పెరుగుతుంది.మీ విజయాన్ని చూసి మీ శత్రువులు అసూయపడతారు.కుటుంబంతో జీవితం సంతోషంగా ఉంటారు.మీపై అధికారుల కారణంగా ఇప్పటివరకున్న సమస్యలన్నీ దూరమవుతాయి.అనవసర ఖర్చులను చేయకపోవడం మంచిది.
కర్కాటకం:

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి.మీ మంచి పనుల వల్ల సమాజంలో మీకుంటూ గౌరవం, కీర్తిని పొందుతారు.ఉపాధి రంగంలో విజయాన్ని సాధిస్తారు.
వ్యాపరస్థులు తమ రంగంలో సమస్యలను ఎదుర్కొంటారు.ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్దగా చూసుకోవడం మంచిది.
మూఢ నమ్మకాల నుంచి విద్యార్థులను దూరంగా ఉంచండి.స్నేహితులతో సంతోసంగా కొంత సమయాన్ని గడుపుతారు.
సింహం:

సింహ రాశి వారికి ఈ రోజు కుటుంబం నుంచి పూర్తి సహకారం పొందుతారు.దీనితో మీ ఆనందం రెట్టింపవుతుంది.వ్యాపారం రంగంలో మీ తండ్రి మార్గదర్శకత్వం ప్రయోజనకరంగా ఉంటుంది.అత్త మామల నుంచి అన్ని సహాయ సహకారాలు లభిస్తాయి.ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కన్య:

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.మీ వాక్ చాతుర్యలో మీ ప్రతిష్టను పెంచుకుంటారు.మీ పనితీరుతో అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు.
జీవిత భాగస్వామితో మీ అనుభవాలను పంచుకుంటారు.వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండంటం మంచిది.
తులా:

ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న వ్యాపార సమస్యలు సమసిపోతాయి.జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.సంతానం నుంచి శుభవార్తలు వింటారు.అదేవిధంగా ఆదాయం కూడా పెరగవచ్చును.వివాహం సమస్యలు తొలిగిపోతాయి.నిరుద్యోగులకు ఉపాధి వంటి శుభవార్తలు వింటారు.ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
వృశ్చికం:

మీరు చేస్తున్న పనుల్లో మీకు గౌరవం, హోదా లభిస్తాయి.పాత అప్పులను తీరుస్తారు.వ్యాపారంలో మీరు తీసుకున్న నిర్ణయాలు విజయవంతమవుతాయి.
విద్యార్థులు ఉన్నత విద్యకు మార్గం సుగమం చేసుకుంటారు.నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
ప్రత్యర్థులు మీ చేతిలో ఓటమి పాలవుతారు.కుటుంబం ఖర్చులను ఎక్కువగా చేస్తారు.
ధనస్సు:

ధనస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి.మీ శత్రువులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.ఈ రోజు ప్రయాణాలు చేస్తారు.అనవసర ఖర్చులు చేయకపోవడం మంచిది.లేకపోతే ఆర్థిక పరిస్థితి క్షీనించే అవకాశం ఉంది.మీ ఇంట్లో సమస్యలను అలవోకగా తీర్చుకుంటారు.
ప్రేమ వలప జీవితంలో మీకు మానసిక శాంతి లభిస్తుంది.విదేశీ బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
మకరం:

ప్రేమ మూలంగా ఈ రోజు వారి నుంచి మీకు గౌరవం లభిస్తుంది.ఇతరుల ద్వారా ఉపకారం అందుకుంటారు.స్నేహితులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు.నిరుద్యోగ యువత శుభవార్తలు వినే అవకాశం ఉంది.కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం అందుకుంటారు.తోబుట్టువులతో సంతోషంగా గడుపుతారు.
కుంభం:

ఈ రాశి వారికి రాజకీయంగా చేయలనుకున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి.ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుంది.తండ్రి మర్గనిర్దేశం వల్ల మంచి భవిష్యత్తును పొందగలుగుతారు.ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.ఇప్పటివరకు మిమ్మల్ని వేధిస్తున్న చిన్న చిన్న వ్యాదుల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఆదాయ, వ్యయాల మధ్య సమతూల్యతను పాటించడం మంచిది.
మీనం:

మీ జీవిత భాగస్వామితో అన్ని విషయాలను పంచుకుంటారు.అలాగే తోబుట్టువులతో సంబంధం గట్టిపడుతుంది.మీ పనితనం వల్ల వ్యాపారంలో మీ విలువ పెరుగుతుంది.మీ స్వభావం వల్ల ఆధిపత్యం చెలాయించగలుగుతారు.పోటీ పరీక్షల్లో విద్యార్థుల్లో విజయాన్నందుకుంటారు.పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది మంచి సమయం.