ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ 17వ తేదీన రామ నవమి నీ అత్యంత వైభవంగా జరుపుకొనున్నారు.ఈ రోజు రామ నవమి పండుగ తో పాటు చక్రం నవరాత్రుల చివరి రోజు అని దాదాపు చాలామందికి తెలుసు.
రామ నవమి రోజు విష్ణువు రాముని అవతారం ఎత్తడనీ పండితులు చెబుతున్నారు.వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు( Lord rama ) మధ్యాహ్నం 12 గంటలకు కార్కటక లగ్నంలో జన్మించాడు.
అందుకే చైత్రమాసంలోనీ శుక్లపక్షం తొమ్మిదవ రోజును పుణ్య దినములలో ఒకటిగా భావిస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ 17వ తేదీన రామ నవమి( Rama Navami ) రోజు ఉదయం 11 గంటల 40 నిమిషముల నుండి మధ్యాహ్నం ఒకటి 40 నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది.
ఈ లోగా రామ నవమి నీ జరుపుకోవాలి.
రామ నవమి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ పవిత్రమైన రోజున శ్రీ రామచంద్రుడు మానవ రూపంలో భూమిపైకి వచ్చాడు.అలాగే రాముడు విష్ణు యొక్క ఏడవ అవతారం అని పండితులు చెబుతున్నారు.
కాబట్టి హిందువులలో రామ నవమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.రాజు దశరధుడు మరియు రాణి కౌసల్య కుమారుడు.
రాముడు ఒక ఆదర్శ మానవుడిగా ధర్మానికి, శౌర్యానికి, ధైర్యానికి ప్రతిక అని భక్తులు నమ్ముతారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీరామ భక్తులందరూ ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు .
ముఖ్యంగా చెప్పాలంటే శ్రీరామనవమి( Sri Rama Navami ) రోజు తెల్లవారుజామున నిద్ర లేచి, స్నానం చేసి, పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి.పూజా స్థలంలో రాముడు, సీతా, లక్ష్మణుడు మరియు హనుమంతుడి విగ్రహాలను అలంకరించాలి.విగ్రహం ముందు దీపం లేదా దుపం వెలిగించాలి.భక్తిని వ్యక్తపరచడానికి భజనలు మరియు మంత్రాలు చెప్పాలి.విగ్రహాల చుట్టూ దీపం వెలిగించి ఆ తర్వాత హారతి ఇవ్వాలి.దేవునికి నైవేద్యం, పండ్లు లేదా మిఠాలను సమర్పించాలి.
దేవునికి భక్తి ప్రార్ధనలు చేసి పూజను పూర్తి చేయాలి.
LATEST NEWS - TELUGU