తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

ఈ రోజు పంచాంగం:

సూర్యోదయం: ఉదయం 5:59
సూర్యాస్తమయం: సాయంత్రం 6:26
రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు
అమృత ఘడియలు: ఉ.11-41 నుంచి 1-25 వరకు
దుర్ముహూర్తం: ఉ.9-56 నుంచి 10-45 వరకు

 Telugu Daily Astrology Rasi Phalalu - Daily Horoscope Jathakamu September 3 Thur-TeluguStop.com

మేషం:

డబ్బును పొదుపు చేస్తారు.మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు కానీ క్షణంలో తప్పించుకుంటారు.అయితే మీరు ఎదురు తిరగకుండ మీ పని మీరు చూసుకోవడం మంచిది.ఆఫీస్ పనుల్లోనూ ఎంతో చురుకుగా ఉంటారు.

వృషభం:

సంపాదించినా డబ్బు అంత ఖర్చు చెయ్యడానికి ప్రయత్నిస్తారు.వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకునేందుకు ప్రయత్నించండి.మీరు అంటే ఇష్టం, శ్రద్ద ఉన్న వారిపట్ల ఆసక్తి చూపించండి.దూరప్రాంతాల నుంచి శుభవార్త అందే అవకాశం ఉంది.

మిథునం:

మీ ఆప్తులతో గొడవలు అయ్యే అవకాశం ఉంది.మీ పిల్లలు మంచి విజయాన్ని అందుకుంటారు.నోటి దురుసు తగ్గించుకోవాలి.ఎంత అవసరమో అంతే మాట్లాడాలి.అప్పుడే ఎటువంటి సమస్యలు రావు.

కర్కాటకం:

అనవసర ఖర్చులు చెయ్యకండి.మీకు ఈరోజు డబ్బు అవసరం ఎంతో ఉంటుంది.

జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తారు.

మీ వల్ల కొందరికి హాని జరిగే అవకాశం ఉంది.కాబట్టి అలాంటి వారికి క్షమాపణ చెప్పండి.పని విషయంలో కొంత ఊరట లభిస్తుంది.

సింహం:

డబ్బు పొదుపు గురించి పెద్దవారితో సలహాలు తీసుకోవడం మంచిది.ఎంత ఖర్చు పెట్టాలి ? అనేది తెలుసుకొని అవసరం ఉన్న చోటా మాత్రమే ఖర్చు పెట్టాలి.బంధువులు మీ ఇంటికి వస్తారు.ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు.

కన్య:

వృత్తి వ్యాపారాల్లో పెద్దవారి సహాయ సలహాలు తీసుకోవడం మంచిది.మీ సరద మనస్తత్వం చుట్టూ ఉన్నవారికి ఉల్లాసాన్ని, ఆనందాన్ని కల్గిస్తాయి.విద్యార్థులు సమయాన్ని వృధా చెయ్యకుండా చూసుకోవాలి.

తులా:

డబ్బు ఎలా దాచుకోవాలి? ఎంత ఖర్చు పెట్టాలి అనేది మీ పెద్దల నుంచి నేర్చుకుంటారు.రోజువారీ జీవితంలో ఎంత ఉపయోగపడుతాయి ? ఆర్ధిక సంబంధాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలి.ఎవరో చేసిన తప్పులకు ఈరోజు మీరు శిక్ష అనుభవించే అవకాశాలు ఉన్నాయ్.జాగ్రత్తగా ఉండండి.

వృశ్చికం:

ఈరోజు బయటకు వెళ్లే ముందు పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి.ఇది మంచి చేస్తుంది.

సామజిక కార్యక్రమాలు పెద్ద వారితో పరిచయాలు పెంచుకునేందుకు సహకరిస్తాయి.బంధువులతో గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

ధనస్సు:

ఆర్ధికంగా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.మానసికంగా ఆనందం కలిగే పనులు చేస్తారు.

ఈరోజు అంత కూడా చురుగ్గా ఉంటారు.అయితే ఇతరుల నుంచి జాగ్రత్తగా ఉండకపోతే మీ వస్తువులు దొంగతనం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

మకరం:

మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.అవసరమైన ధనం లేక పోవటం వల్ల కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తలు తీసుకోండి.సహా ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండండి.

కుంభం:

ఈరోజు కొన్ని విషయాల కారణంగా మీరు ఎక్కువ కోపం తెచ్చుకుంటారు.వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకోనున్నారు.చదువుల కోసం లేక ఉద్యోగుల కోసం ఇంటి నుంచి దూరంగా వెళ్లే అవకాశం ఉంది.

మీనం:

రక్తపోటు ఉన్నవారు జాగ్రత్త తీసుకోవాలి.మీ విలువైన వస్తువులు దొంగతనం జరిగే అవకాశం ఉంది.అందుకే మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి.కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు కళను ప్రదర్శించడానికి ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయి.ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube