ప్రస్తుతం ఎన్నో విషయాల్లో మల్టీ టాస్కింగ్( Multi Tasking ) కామన్ అయిపోయింది.చివరికి ఇది భోజన సమయం వరకు కూడా విస్తరించింది.
అయితే ఇంట్లో ఉన్నప్పుడు చాలామంది టీవీ లేదా ల్యాప్టాప్ లో ఇష్టమైన షో చూస్తూ ఆహారం తీసుకోవడం, స్నాక్స్ తినడం లాంటివి చేస్తూ ఉంటారు.అయితే ఇలా తినడం ఆనందంగా అనిపించినప్పటికీ, వాస్తవానికి ఆరోగ్యం పై హానికర ప్రభావం చూపిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
అయితే టీవీ చూస్తూ తినే అలవాట్ల( Seeing TV While Eating ) వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.తినే సమయంలో టెలివిజన్ చూస్తుంటే మీకు ఫోకస్ అంతా అందులో జరగబోతున్న దానిపైనే ఉంటుంది.
ఒక విధంగా చెప్పాలంటే ఎంత తింటున్నారో? ఏం తింటున్నారో? అని కూడా గ్రహించలేక పోతారు.ఈ పరిస్థితి ఓవర్ ఈటింగ్ డిజార్డర్( Over Eating Disorder ) కు కూడా దారితీస్తుంది.ఎందుకంటే మీరు టీవీలో నిమగ్నమై ఉన్నప్పుడు ఎంత తిన్నా కడుపునిండిన సంతృప్తి పొందలేక పోతారు.దీంతో అధికంగా తినేస్తారు.ఈ పరిస్థితి బరువు పెరగడానికి జన సంబంధిత సమస్యలకు అసౌకర్యానికి దారితీస్తుంది.తినడం వలన మీరు తినే ఆహారంలో క్వాలిటీని కూడా పట్టించుకోరు.
పైగా క్వాంటిటీని ఎక్కువగా పెంచుతారు.ఎక్కువగా క్యాలరీలతో కూడిన, ప్యాక్ చేసిన ఆహారాన్ని తింటూ ఉంటారు.
ఇక చాలామంది ఈ టీవీ చూస్తున్నప్పుడు హై క్యాలరీలు, చక్కెర కొవ్వు, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలను తినడానికి ఇష్టపడతారు.
మరి ముఖ్యంగా చెప్పాలంటే చిప్స్ కుకీస్ సోడా కలిపిన ఆహారాలు ఇందులో భాగంగా ఉంటాయి.ఇది కాలక్రమమైన పోషకాహార లోపానికి కూడా దారితీస్తుంది.ఇక భోజన సమయంలో టీవీలు చూడడం అనేది ఊబకాయ సమస్య( Obesity )కు కూడా దారితీస్తుందని పలు అధ్యయనాలలో కూడా పేర్కొంటున్నాయి.
పిల్లల్లో, పెద్దల్లో ఈ పరిస్థితి జీవక్రియ రేటును మందగించేలా చేస్తుంది.ఇక పిల్లలు చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి కూడా ఇదే కారణం అని చెప్పవచ్చు.
కాబట్టి టీవీలు, డెస్క్ టాప్ లపై, ఫోన్లో నిమగ్నమై భోజనం చేయడం, స్నాక్స్ తినడం లాంటి అలవాట్లను దూరం చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.