ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.అంతే కాకుండా దాదాపు చాలా మంది భక్తులు స్వామి వారికి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.
మరి కొంత మంది వ్యక్తులు స్వామి వారికి తల నీలాలు సమర్పిస్తూ ఉంటారు.మన దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు స్వామి వారి దర్శనం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు.
అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం నెలలో రెండు మూడు సార్లు టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తూ ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సలకట్ల వసంతోత్సవ సేవ టికెట్లు కొటా ను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 27వ తేదీన విడుదల చేయనుంది.

ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధి పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలను దేవాలయం వెనుక భాగంలో ఉన్న వసంత మండపంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి 4 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమంజనం నిర్వహిస్తారు.ఎప్పటిలాగే భక్తులను ఈ సేవకు అనుమతించేలా తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam ) మూడు రోజులకు సంబంధించిన టికెట్లు కొటా ను Tirupatibalaji.AP.GovV.in వెబ్ సైట్ లో 27వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.

అంతే కాకుండా వయోవృద్ధుల, దివ్యాంగుల,దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్ నెల ఉచిత టోకెన్ల కొటా ను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.ఇంకా చెప్పాలంటే జూన్ నెలలకు సంబంధించిన అర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ రిజిస్ట్రేషన్లు కూడా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 11 గంటల వరకు చేసుకునే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పించింది.
DEVOTIONAL







