ఊహకు ఇష్టం లేకపోయినా తప్పక ఆ పని చేస్తున్నా... శ్రీకాంత్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతోమంది ఫ్యామిలీ ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు శ్రీకాంత్( Sreekanth ) ఒకరు.కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ నుసంపాదించుకున్నటువంటి ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

 Even If You Dont Like It You Have To Do It Srikanths Comments Are Viral ,sreekan-TeluguStop.com

ఇక ఈయన ఇంకా హీరోలకు బాబాయ్ పాత్రలలోనూ నటిస్తూ సందడి చేయడమే కాకుండా విలన్ గా కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

Telugu Akhanda, Divorce, Roshan, Sreekanth, Srikanth, Tollywood-Movie

ఇక కెరియర్ పరంగా శ్రీకాంత్ ఎంతో మంచి సక్సెస్ సాధించినప్పటికీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.శ్రీకాంత్ నటి ఊహను( Ooha ) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే ఇక ఈ దంపతులకు ముగ్గురు సంతానం కాగా ఇప్పటికే పెద్ద కుమారుడు రోషన్( Roshan) హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇలా ఎన్ని సంవత్సరాలు పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి శ్రీకాంత్ ఊహ దంపతులు విడాకులు( Divorce ) తీసుకుని విడిపోతున్నారనే వారితో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

అయితే ఈ వార్తలను విన్న శ్రీకాంత్ ఒక్కసారి కషాక్ అవుతూ వెంటనే ఇందులో ఏమాత్రం నిజం లేదని ఖండించారు.

Telugu Akhanda, Divorce, Roshan, Sreekanth, Srikanth, Tollywood-Movie

ఇకపోతే తాజాగా మార్చి 23వ తేదీ శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మరోసారి విడాకుల గురించి ఈయన స్పందించారు.ఇలాంటి వార్తలు విన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది.

సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను ఎవరికి నచ్చినట్టు వారు రాసేస్తున్నారు ఒకసారి అయితే ఏకంగా నేను చనిపోయాను అంటూ వార్తలు కూడా రాశారు.ఇలాంటి వార్తలు చూసినప్పుడు కాస్త బాధగా ఉంటుంది.

అయితే ఇక నేను ఊహా విడాకులు తీసుకోబోతున్నాం అంటూ కూడా వార్తలు వచ్చాయి.ఈ వార్తలు వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా ఊహని వెంట తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సాధారణంగా ఊహకు బయట ఫంక్షన్లకు రావడం ఇష్టం ఉండదు కానీ విడాకుల వార్తలు వచ్చిన తర్వాత తనకు ఇష్టం లేకపోయినా నేను తనని బయటకు తనతో పాటు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటూ శ్రీకాంత్ తెలిపారు.ఇలా విడాకుల వార్తలపై శ్రీకాంత్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube