మసాలా దినుసుల్లో నల్ల మిరియాలది< ప్రత్యేక స్థానం అనడంలో సందేహమే లేదు.ఘాటైన రుచి కలిగి ఉండే వీటిని వంటల్లో విరి విరిగా ఉపయోగిస్తుంటారు.
ముఖ్యంగా నాన్ వెజ్ వంటలకు కాస్త నల్ల మిరియాల ఘాటు తగిలితే రుచి అదిరిపోతుంది.వంటలకు మంచి రుచిని అందించే నల్ల మిరియాల్లో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ ఇ, విటమిన్ బి1, విటమిన్ బి3, విటమిన్ బి6, కాల్షియం, పొటాషం, సోడియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, ప్రోటీన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇలా ఎన్నో నిండి ఉంటాయి.
అందుకే నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అయితే చాలా మంది నల్ల మిరియాలను వంటల్లో మాత్రమే వాడుతుంటారు.కానీ, వీటిని ఇప్పుడు చెప్పే విధంగా తీసుకుంటే మరెన్నో బెనిఫిట్స్ పొందొచ్చు.సాధారణంగా చాలా మంది అధిక బరువు సమస్యతో బాధ పడుతుంటారు.
అలాంటి వారు ఒక గ్లాస్ వాటర్‌లో అర స్పూన్ నల్ల మిరియాలు, అర స్పూన్ మెంతులు వేసి రాత్రంతంతా నాన బెట్టండి.
![Telugu Benefitsblack, Black Pepper, Benefits, Tips, Latest-Telugu Health - త Telugu Benefitsblack, Black Pepper, Benefits, Tips, Latest-Telugu Health - త](https://telugustop.com/wp-content/uploads/2021/07/good-health-latest-news-health-tips-benefits-of-black-pepper-black-pepper-for-health.jpg )
ఉదయాన్నే ఆ వాటర్‌ను బాగా మరిగించి ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్‌లో కొద్దిగా తేనె కలిపి తీసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.
అంతేకాదు, ఈ వాటర్‌ను తాగిత రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.
మరియు శ్వాస సంబంధిత సమస్యలు పరార్ అవుతాయి.
అలాగే మరో పద్దతిలో గ్లాస్ వాటర్ తీసుకుని అందులో అర స్పూన్ మిరియాల పొడి మరియు కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా హీట్ చేయాలి.
కలర్ చేంజ్ అయిన తర్వాత నీటిని వడబోసుకుని సేవించాలి.ఇలా ప్రతి రోజు చేస్తే.జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి తగ్గు ముఖం పడతాయి.రక్త పోటు అదుపులో ఉంటుంది.
క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.మరియు కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.