శ్రీశైల క్షేత్రాన్ని ఏ నెలలో దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా..?

శ్రీశైల క్షేత్రాన్ని( Srisaila Kshetra ) దర్శించడానికి ప్రతి రోజు ఎన్నోవేల మంది భక్తులు తరలివస్తూ ఉంటారు.కొంతమంది భక్తులు ఇప్పటివరకు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఉండరు.

 Do You Know What Kind Of Results You Will Get If You Visit Srisaila Kshetra In A-TeluguStop.com

కానీ శ్రీశైల దేవుని విశిష్టత గురించి తెలిస్తే జీవితంలో ఒక్కసారి అయినా దర్శించాలని అనుకుంటారు.అంతటి మహత్తర శక్తి పీఠం శ్రీశైలం అన్ని పండితులు చెబుతున్నారు.

ఎన్నో జన్మల పుణ్య ఫలితంగానే శ్రీశైలం దర్శన భాగ్యం కలుగుతుంది.ఈ పుణ్యక్షేత్రం గురించి స్కంద పురాణంలోనీ శ్రీశైల కాండలో వెల్లడించారు.

ఈ క్షేత్రాన్ని ఏ నెలలో దర్శించుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Cows, Ashvayuga, Bhakti, Devotional-Telugu Bhakthi

చైత్రమాసంలో దర్శిస్తే సకల శుభాలు కలిగి ఆశించిన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుందని చెబుతున్నారు.అలాగే వైశాఖ మాసంలో ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే 1000 ఆవులను దానం( 1000 cows ) చేసిన పుణ్యం కలుగుతుంది.

జ్యేష్ట మాసంలో సందర్శిస్తే బంగారం దానం చేసిన పుణ్య ఫలితం ఉంటుంది.ఇంకా చెప్పాలంటే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి.ఆషాడమాసంలో దేవుడిని దర్శిస్తే బంగారు రాసులను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది.అలాగే కోటి గోవుల్ని శివాలయానికి దానం చేసిన పుణ్యం లభిస్తుంది.

శ్రావణమాసంలో( Sravanamasam ) ఇక్కడకు వస్తే పొలాలను పంటతో పాటు పండితుడికి దానం చేసినంత ఫలితం దక్కుతుందని చెబుతున్నారు.భాద్రపద మాసంలో దర్శిస్తే కోటి కపిల గోవులను దానం చేసినట్లు అవుతుంది.

Telugu Cows, Ashvayuga, Bhakti, Devotional-Telugu Bhakthi

అలాగే అశ్వయుజ మాసంలో( Ashvayuga ) వెయ్యి కన్యాదానాలు చేసినంత పుణ్యం పుణ్యం లభిస్తుంది.అలాగే పాపాలు తొలగిపోయి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.కార్తిక మాసంలో వాజపేయ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది.అలాగే మార్గశిర మాసంలో దర్శిస్తే పౌండరీక యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది.అలాగే రాజసూయ యాగం చేసినంత పుణ్యఫలం కూడా లభిస్తుంది.ఇంకా చెప్పాలంటే శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వల్ల మనకు ఎన్నో పుణ్యఫలాలు లభిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube