అధిక రక్త పోటు.దీనిని హై బీపీ అని కూడా పిలుస్తుంటారు.
ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, అధిక ఒత్తిడి, వ్యాయామాలకు దూరంగా ఉండటం, నిద్రను నిర్లక్ష్యం చేయడం ఇలా రకరకాల కారణాల వల్ల అధిక రక్త పోటు సమస్య ఏర్పడుతుంది.ఈ అధిక రక్త పోటు సమస్య చిన్నదే అయినప్పటికీ.
నిర్లక్ష్యం చేస్తే అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.ఒక్కోసారి ప్రాణాలను కూడా తీసేస్తుంది.
అందుకే ఈ సమస్యను నివారించుకోవడం చాలా ముఖ్యమైని నిపుణులు చెబుతుంటారు.అయితే అధిక రక్త పోటుకు చెక్ పెట్టడంతో కొన్ని కొన్ని ఆహారాలు సూపర్‌గా సహాయపడతాయి.
అలాంటి వాటిలో అవిసె గింజలు ఒకటి.అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా అధిక రక్త పోటుతో బాధ పడే వారు అవిసె గింజలను తీసుకంటే.అందులో ఉండే విటమిన్ ఇ, ఫైబర్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు రక్త పోటును అదుపులోకి తెస్తాయి.
గుండె జబ్బులన బారిన పడకుండా కూడా రక్షిస్తాయి.అయితే ఆవిసె గింజలను డైరెక్ట్‌గా తినలేరు.
కనుక అవిసె గింజలను పొడి చేసి.కూరల్లో లేదా రొట్టెల పిండిలో కలిపి తీసుకుంటే అధిక రక్త పోటుకు చెక్ పెట్టవచ్చు.
అలాగే వెల్లుల్లి కూడా అధిక రక్త పోటును నివారించగలదు.వెల్లుల్లి రెబ్బలను వాటర్‌లో వేసి మరిగించి తీసుకోవడం లేదా తేనెలో కలిపి రోజుకో రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం చేయాలి.ఇలా ఎలా చేసినా రక్త పోటు కంట్రోల్ అవుతుంది.
ఇక కొన్ని పండ్లు కూడా అధిక రక్త పోటు సమస్యను దూరం చేయాలి.ముఖ్యంగా అరటి పండు, జామ పండు, కివి పండు, బత్తాయి పండు, ద్రాక్ష వంటివి తీసుకోవడం వల్ల రక్త పోటు అదుపులో ఉంటుంది.