ప్రెగ్నెన్సీ సమయంలో నా గొంతు పోయింది.. సింగర్ ప్రణవి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ సింగర్ ప్రణవి( Singer Pranavi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను అలరించింది.

 Singer Pranavi Shared About Her Pregnancy Journey Details, Singer Pranavi, Pregn-TeluguStop.com

తన పాటలతో ప్రేక్షకులను మైమరిపించింది.ఇప్పటికే ఎన్నో పాటలు పాడిన విషయం తెలిసిందే.

స్టార్ హీరోల సినిమాల దగ్గర నుంచి చిన్న చిన్న సినిమాల వరకు ఎన్నో సినిమాలకు పాటలు పాడి సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సింగర్ ప్రణవి.ఇకపోతే ఈమె కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ప్రముఖ టాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ అయినా రఘు మాస్టర్ ను( Raghu Master ) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ దంపతులకు ఒక పాప కూడా జన్మించింది.

Telugu Pregnancy, Raghu Master, Pranavi, Pranavi Baby, Pranaviraghu, Tollywood-M

పెళ్లి తర్వాత చాలా వరకు సోషల్ మీడియాలో అలాగే బయట చాలా తక్కువగా కనిపిస్తుంటారు ప్రణవి.ఇది ఇలా ఉంటే చాలా కాలం తర్వాత ప్రణవి అలాగే ఆమె భర్త కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు వ్యక్తిగత విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాలను కూడా పంచుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రణవి ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.ఈ సందర్భంగా ప్రణవి మాట్లాడుతూ.

ప్రెగ్నెన్సీ( Pregnancy ) తర్వాత నా వాయిస్ పోయింది.పాప పుట్టిన తర్వాత దాదాపుగా రెండున్నర సంవత్సరాలు పాడలేకపోయాను.

ఆ తర్వాత కూడా పాడలేనేమో అనుకున్నాను.అందుకే రికార్డింగ్స్ కి కూడా వెళ్ళలేదు.

Telugu Pregnancy, Raghu Master, Pranavi, Pranavi Baby, Pranaviraghu, Tollywood-M

కనీసం పాపని పడుకోబెట్టడానికి కూడా గొంతు రాలేదని.అప్పుడు అసలు ఈ జీవితమే వేస్ట్ అని అనిపించిందని చెప్పుకొచ్చింది.అలా కొంతకాలం తర్వాత మళ్లీ సాంగ్స్ పాడడం స్టార్ట్ చేసానని తెలిపింది.మా పాపకి జోలపాట పాడకపోతే అస్సలు పడుకోదు.తన కోసమైనా రోజు పాటలు పాడతాను.తనకి అన్ని పాటలు పాడడం వచ్చు.

అన్ని పాటలు వింటుంది అని చెప్పుకొచ్చింది ప్రణవి.ఈ సందర్భంగా ప్రణవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube