ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకుంటే పోషకాలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం.అప్పుడే రోజంతా మనం ఎనర్జిటిక్ గా ఉండగలుగుతాం.
పనితీరు కూడా మెరుగుపడుతుంది.అయితే చలికాలం వచ్చిందంటే చాలు చాలా మందికి బద్ధకం వస్తుంది.
ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆఫీసులో పనులు గాక అన్నిటిపై అనాసక్తి ఏర్పడుతుంది.ఈ క్రమంలో చలికాలంలో రోజంతా హుషారుగా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల పదార్థాలను మీ ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యం చెబుతున్నారు.
ఈ ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

అంతే కాకుండా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.మలబద్దకం సమస్యల నుంచి బయట పడడానికి సహాయపడుతుంది.మరి ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో అరటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో మంచిది.ఇందులో సహజ చక్కెర ఉంటుంది.
ఇందులో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.వీటిని తిన్న తర్వాత మీరు శక్తివంతంగా తయారవుతారు.
మానసిక స్థితిని కూడా మెరుగుపడుతుంది.స్మూతీస్, స్నాక్స్ రూపంలో కూడా వీటిని తినవచ్చు.

మొలకలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ముఖ్యంగా ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మొలకలు తీసుకోవడం వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది.ఇందులో ఐరన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.డ్రై ఫ్రూట్స్ శక్తి స్థాయిలను పెంచడంలో ఎంత గానో ఉపయోగపడతాయి.అవిసె గింజలు, గుమ్మడి గింజలు, వేరుశనగ, బాదం మొదలైనవి ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
వీటిలో మెగ్నీషియం ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.చలికాలంలో ఓట్స్ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆ రోజంతా ఆరోగ్యంగా, ఉషారుగా ఉంటారు.