సినిమా ప్రపంచంలో అందం అనేది చాలా ముఖ్యం.దానికి తోడు ఇమేజ్ ఉన్నప్పుడే ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది.
ఛాన్సులు తగ్గుతున్నాయి అనుకున్నప్పుడు పలువురు హీరోయిన్లు ఏ పాత్ర వచ్చినా చేస్తారు.ఒక్కోసారి ఆ అవకాశాలు మంచిని కలిగించవచ్చు మరోసారి రివర్స్ లో దెబ్బకొట్టవచ్చు.
సరిగ్గా హీరోయిన్ రుతిక విషయంలో ఇదే జరిగింది.సరిగా అవకాశాలు రాక స్పెసల్ సాంగ్స్ చేసింది.
ఆ తర్వాత కెరీర్ పరంగా కోలుకోలేని రీతిలో నష్టపోయింది.
సిక్స్ టీన్స్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రుతిక.ఈ సినిమాకు జి.నాగేశ్వర్ రావు దర్శకత్వం వహించాడు.ఈ సినిమా సక్సెస్ కావడంతో వరుస అవకాశాలను దక్కించుకుంది.ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేసింది.
నాలుగేళ్ల పాటు హీరోయిన్ గా మంచి ఇమేజ్ దక్కించుకుంది.అయితే సినిమాల కథలు, ఆమె క్యారెక్టర్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోలేకపోయింది.
దీంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి.
అటు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమార్కుడు సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.కానీ పెద్దగా రాణించలేకపోయింది.ఒకానొక సమయంలో అస్సులు ఛాన్సులు రాకపోవడంతో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.
అయినా తన రాత మారలేదు.ప్రస్తుతం రుతికకు సినిమా అవకాశాలు రావడం లేదు.
బెంగళూరులోని తన ఇంటికే పరియితం అయ్యింది.నిజానికి ఆమె పలు తెలుగు సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందింది.
సారీ మా ఆయన ఇంట్లో నే ఉన్నాడు, సారీ నాకు పెళ్లైంది, సరదా సరదాగా, పెళ్ళికి నేను రెడీ, బ్లేడ్ బాబ్జి, ఎక్స్ ట్రా సహా పలు సినిమాలతో జనాలను బాగా ఆకట్టుకుంది.కానీ తన నిర్ణయాల్లో తప్పటడుగుల కారణంగా సినీ కెరీర్ ను సక్సెస్ పుల్ గా ముందుకు కొనసాగించలేకపోయింది.
అంతేకాదు.స్పెషల్ సాంగ్స్ చేయడంతో ఇంకా ఆమె నుంచి రాబట్టాల్సిన సరుకు లేదని భావించిన సినిమా దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం మానేశారు.
మంచి టాలెంట్ ఉన్న ఇంటికే పరిమితం అయ్యింది రుతిక.