ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్, బాలీవుడ్ కొన్ని కుటుంబాల కనుసన్నల్లో నడుస్తోంది.వారు.
వారి కొడుకులు.వారి మనువలు హీరోలుగా రాణిస్తున్నారు.
ఏ సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా రంగంలో ఎదగడం చాలా కష్టం అయిపోయింది.పేరున్న సినీ కుటుంబంలో కనీసం అల్లుడిగానైనా ఎంట్రీ ఇస్తే తప్ప సినిమా రంగంలోకి ప్రవేశం అంత ఈజీగా జరగదు.
ఇండస్ట్రీలోకి రావడం ఒకెత్తు అయితే.జనాలను మెప్పించి నిలబడ్డం మరో ఎత్తు.
అయితే కుటుంబాల పెత్తనం కొనసాగుతున్నా.కొందరు ఏ బ్యాగ్రౌండ్ లేకుండా.
కేవలం టాలెంట్ ను నమ్ముకుని సినిమా రంగంలోకి వచ్చి సత్తా చాటుకుంటున్నారు.ఇంతకీ వారెవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలాంటి ససోర్టు లేకుండా సినిమారంగంలోకి వచ్చి సత్తా చాటుకున్న నటుల్లో ఒకడు విజయ్ దేవరకొండ.ఇతడితో పాటు నిఖిల్ విశ్వక్సేన్ లాంటి వాళ్లు కూడా సొంతంగా కష్టపడి సినిమా పరిశ్రమలోకి వచ్చి మంచి పేరు సంపాదించారు.తాజాగా ఈ లిస్టులో చేరాడు కిరణ్ అబ్బవరం.ఈ కొత్త కుర్రాడు ఏ బ్యాగ్రౌండ్ లేకుండా రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టాడు.
రాజావారు రాణి వారు అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.ఈ సినిమా థియేటర్లలో కన్నా అమేజాన్ ప్రైమ్ లో అద్భుతంగా ఆడింది.
ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి.
కిరణ్ రెండో సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం.ఈ సినిమాకు కిరణ్ స్వయంగా కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు.దీనికి సంబంధించి టీజర్ కూడా యూత్ ను ఆకట్టుకునేలా ఉంది.
అటు వెంకటేష్ లాంటి పెద్ద హీరో సినిమా నారప్ప ఓటీటీ విడుదలకు రెడీ అవుతుంటే.వీరు మాత్రం ఓటీటీల నుంచి వస్తున్నఆఫర్లకు కాదంటున్నారు.
థియేటర్లలో రిలీజ్ చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.ఆగష్టు 6న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది.
అటు ఈ సినిమాతో పాటు చాందినీ చౌదరితో కలిసి సమ్మతమే అనే మరో మూవీ చేస్తున్నాడు కిరణ్.అటు సెబాస్టియన్ అంటూ ఒక పోలీస్ స్టోరీలోనూ కిరణ్ యాక్ట్ చేస్తున్నాడు.ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ విడుదలై ఆకట్టుకుంటుంది.అటు కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి నిర్మాణంలో కిరణ్ హీరోగా కార్తీక్ శంకర్ అనే కొత్త దర్శకుడు మరో సినిమా రూపొందిస్తున్నాడు.
వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కిరణ్.