తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది హీరోలు ఉన్నప్పటికి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో( Tamil film industry ) ధనుష్ లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి. ధనుష్( Dhanush ) లాంటి పాత్రనైనా చేస్తాడు.
అతనికి నచ్చితే బిచ్చగాడి నుంచి రాజు వరకు ఎలాంటి పాత్రనైనా చేయడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు.

మరి ఇలాంటి నేపధ్యంలోనే ఆయన లాంటి హీరో తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు లేరు మనవాళ్లు ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి మంచి క్యారెక్టర్లు ఎందుకు మిస్ చేసుకుంటున్నారు అనే ధోరణిలో కూడా తెలుగు హీరోల పైన కొన్ని విమర్శలు అయితే వెలువడుతున్నాయి.ఇక ఇండియా మొత్తంలో ఎవరి దగ్గర మంచి కాన్సెప్ట్ ఉన్నా కూడా ధనుష్ వాళ్ళతో సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకుంటు ఉంటాడు.మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికి భారీ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

తద్వారా పాన్ ఇండియాలో( Pan India ) భారీ మార్కెట్ కూడా క్రియేట్ అవుతుంది.ఇక ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేర సినిమాలో బిచ్చగాడు క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే నటిస్తానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన ధనుష్ కోసం చాలామంది దర్శకులు మంచి కథను రెడీ చేసి పెట్టుకున్నారు.ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలు ఇమేజ్ చట్రం లో ఇరుక్కోకుండా మంచి కథలను చేస్తే మాత్రం వాళ్లకు కూడా ధనుష్ లాంటి మంచి పేరు అయితే వస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఆయన చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ ను సాదిస్తాయి అనేది…
.