మన దేశంలో సమస్యల పరిష్కారానికి ఎంతో మంది సాధారణ వ్యక్తులు అసాధారణమైన ఆలోచనలు చేసి అదిరిపోయే జుగాడ్ ట్రిక్స్ కనిపెడుతుంటారు.ఈ తరహా జుగాడ్ వీడియోలు ( Jugaad Videos ) తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఓ వ్యక్తి తన ఇంటి తలుపు దగ్గర అద్భుతమైన ట్రిక్ ఏర్పాటు చేశాడు.
తలుపు పక్కన ఓ మేకు ( Nail ) కొట్టి, దానికి తలుపు గడియకు కలిపేలా ఒక గిన్నె(Metal Utensil) కట్టాడు.
ఇలా ఉంచడం ద్వారా ఎవరైనా ఆ తలుపును తెరిచినప్పుడు ఆ గిన్నె కింద పడిపోతుంది.దీంతో పెద్ద శబ్దం వస్తుంది.రాత్రి సమయంలో ఈ శబ్దం వస్తే ఇంట్లోవాళ్లకు ఒక్కసారిగా తెలుస్తుంది.
ఈ వైరల్ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ రాగా.లైకులు కూడా అదే రేంజ్ లో వచ్చాయి.
వీడియో చూసిన నెటిజన్లు అదిరిపోయే కామెంట్లు చేస్తున్నారు.
ఇలా నీవు ఇంత సింపుల్ గా పరిష్కారం కనిపెడితే దొంగలు ఎలా బ్రతకాలి బ్రదర్? అని కొందరు కామెంట్ చేస్తుండగా.మరొకరు దొంగ కిటికీ నుంచి వస్తే ఎలా అని కామెంట్ చేస్తున్నారు.ఇంకొందరైతే.
ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి బ్రదర్? అంటూ కామెంట్లు చేస్తున్నారు.దొంగతనాలు నివారించడానికి ఇలా చిట్కాలు ఉపయోగించుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
చాలా మంది ఈ ట్రిక్‌ను స్మార్ట్ ఐడియాగా అభిప్రాయపడుతున్నారు.ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పాపులర్ అయిన ఈ వీడియో కొంత మందికి జాగ్రత్తగా ఉండే కొత్త ఆలోచనలను తీసుకొచ్చిందని చెప్పాలి.
మరి మీకు ఇలాంటి ట్రిక్స్ తెలిసింటే కామెంట్స్ లో తెలపండి.అలాగే ఈ వైరల్ వీడియో మీకెలా అనిపించిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.