మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేసే పండ్లు..

మధుమేహ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు చిన్న వయసు నుంచే బాధపడుతున్నారు.అందువల్ల ఈ వ్యాధి ఉన్నవారు తీసుకునే ఆహారపు అలవాట్ల విషయంలో విరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

 Fruits For Diabetic Patients Orange Strawberries Apple Details, Fruits ,diabetic-TeluguStop.com

ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే రక్తంలో చక్కెర స్థాయి పెరిగే వీరి ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది.రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో లేకపోతే కిడ్నీ వ్యాధులు, నరాల సమస్యలు, కంటి సమస్యలు వంటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అయితే డయాబెటిస్ పేషెంట్స్ కు తమ ఆహారం విషయంలో కొన్ని అపోహలు ఎప్పుడూ ఉంటాయి.ముఖ్యంగా పండ్లలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుందని అందువల్ల వాటిని తినకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు.

ఇంకా వాటిని తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని ఆందోళన చెందుతూ ఉంటారు.డయాబెటిస్తో బాధపడేవారు ఏ పండ్లను తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.ఆరెంజ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ లెవెల్ 40 గా ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్ నిరభ్యంతరంగా వీటిని తినడానికి ఉపయోగించవచ్చు.ఇంకా చెప్పాలంటే ఆరెంజ్ లో పుష్పలంగా ఉండే విటమిన్ సి శరీరాన్ని ఇన్ఫెక్షన్ ల నుండి కాపాడుతుంది.

ఇంకా చెప్పాలంటే ఎముకలు, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఆరంజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Telugu Apple, Diabetes, Diabetic, Fruits, Glycemic Index, Tips, Healthy Fruits,

అంతే కాకుండా జీర్ణ క్రియ అవసరమైన ఫైబర్ నుంచి ఆరంజ్ లో సమృద్ధిగా ఉంటుంది.చెర్రీస్ ను పోషకాలు ఎక్కువగా ఉండే ఫ్రూట్ గా చెబుతూ ఉంటారు.దీనిలో గ్లైసిమిక్ ఇండెక్స్ 20 మాత్రమే ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.

దీనిలో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్  జీర్ణ వ్యవస్థకి, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఇంకా చెప్పాలంటే స్టాబెరిస్ అన్ని రకాల షుగర్ పేషంట్స్ కు ఎంతగానో మేలు చేస్తాయి.

వీటిలో ఇతర పండ్ల కంటే తక్కువ చక్కెర, ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చేస్తాయి.షుగర్ వ్యాధి ఉన్నవారు ఆపిల్ తినడం కూడా ఎంతో మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube