మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు.హరీశ్ రావు ఇతర పార్టీలపై పదే పదే మండిపడుతున్నారని విమర్శించారు.
బీజేపీ చేరికల కమిటీని చీలికల కమిటీ అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.నిధులు, గౌరవం లేక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ముందు సర్పంచుల ఆత్మహత్యలపై దృష్టి పెట్టాలని హరీశ్ రావుకు సూచించారు.ఇతర పార్టీలపై విరుచుకుపడి మీ స్థాయిని తగ్గించుకోవద్దని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఈటల పేర్కొన్నారు.







