తెల్ల జుట్టుతో చింతేలా.. ఈ మూడింటితో సహజంగానే నల్లగా మార్చుకోండి!

ప్ర‌స్తుత రోజుల్లో చాలా మంది పాతిక‌, ముప్పై ఏళ్లకే తెల్ల జుట్టు( white hair ) సమస్యను ఎదుర్కొంటున్నారు.తక్కువ వయసులోనే జుట్టు తెల్లబడటానికి రకరకాల కారణాలు ఉంటాయి.

 Turn White Hair Black Naturally With These Three Powerful Ingredients! Hair, Hai-TeluguStop.com

ఏదేమైనా త‌ల‌లో తెల్ల వెంట్రుకల‌ను చూడగానే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది.తీవ్ర ఒత్తిడికి లోన‌వుతారు.

వెంట‌నే తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకునేందుకు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్స‌లు చింతించ‌కండి.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.

Telugu Black, Coffee Powder, Care, Care Tips, Healthy, Kalonji Seeds, Mud Oil, W

ఈ రెమెడీతో తెల్ల జుట్టును సహజంగానే నల్లగా మార్చుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్( Kalonji Seeds ) వేసి కనీసం ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న కలోంజీ సీడ్స్ ను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకోవాలి.

Telugu Black, Coffee Powder, Care, Care Tips, Healthy, Kalonji Seeds, Mud Oil, W

అలాగే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆవ నూనె( Mustard Oil ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

కలోంజి సీడ్స్, కాఫీ పౌడర్ మరియు ఆవనూనె.ఈ మూడు తెల్లబడిన జుట్టును రిపేర్ చేయడానికి సహాయపడుతాయి.

తెల్ల జుట్టు రావడం ప్రారంభమైన వెంటనే ఆలస్యం చేయకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని వారానికి రెండు సార్లు చొప్పున పాటిస్తే జుట్టులో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది.దాంతో తెల్లగా మారిన జుట్టు క్రమంగా నల్లబడుతుంది.

ఒకవేళ తెల్ల జుట్టు మీకు లేకపోయినా కూడా ఈ రెమెడీని ట్రై చేయ‌వ‌చ్చు.ఈ రెమెడీ మీ జుట్టు ఎల్లప్పుడూ నల్లగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.

అలాగే కలోంజి సీడ్స్, ఆవనూనె మరియు కాఫీ పౌడర్ హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తాయి.మరియు జుట్టు రాలడాన్ని సైతం అరికడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube