మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప (Kannappa)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 25వ తేదీ విడుదల కాబోతోంది.ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు.
మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అందరితో పంచుకుంటున్నారు.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇందులో మోహన్ లాల్ , మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రభాస్ వంటి స్టార్ సెలబ్రిటీలు భాగమయ్యారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా మంచు విష్ణు ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.నిజానికి తాను ఆంజనేయ స్వామి భక్తుడని తెలిపారు.కానీ కన్నప్ప సినిమా చేసిన తర్వాత శివ భక్తుడిగా మారిపోయానని తెలిపారు.ఈ కన్నప్ప సినిమా షూటింగ్ సమయంలో తాను ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) రుద్ర (Rudra)పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఇక ఇది వరకే విడుదల చేసిన టీజర్లు ప్రభాస్ లుక్ టీజర్ కి హైలెట్గా నిలిచిందని చెప్పాలి.ఇక ప్రభాస్ రుద్ర పాత్ర గురించి విష్ణు మాట్లాడుతూ…సినిమాలో ప్రభాస్ పాత్రపై మీరు ఎంత ఊహించుకున్నా అంతకుమించి అనేలా ఆ పాత్ర ఉంటుందని ప్రభాస్ పాత్ర గురించి చెబుతూ సినిమాకి భారీ హైప్ క్రియేట్ చేశారు.మరి ఎన్నో అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో మంచు మోహన్ బాబు నిర్మించారు.