ఒకప్పుడు తెల్ల జుట్టు సమస్య వయసు పైబడిన వారిలోనే కనిపించేది.కానీ ఇటీవల రోజుల్లో చిన్న వయసు వారు సైతం తెల్ల జుట్టు సమస్యకు గురవుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఆహారపు అలవాట్లు, హార్మోన్ ఛేంజెస్, ఒత్తిడి, పోషకాల కొరత, జీవన శైలిలో చోటుచేసుకున్న మార్పులు, కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలను వాడటం, జుట్టు సంరక్షణ లేక పోవడం ఇలా రక రకాల కారణాల వల్ల చిన్న వయసులోనే నల్ల జుట్టు తెల్లగా మారిపోతోంది.దాంతో ఏం చేయాలో తెలీక తెల్ల జుట్టు ను కవర్ చేసుకునేందుకు కలర్స్‌పై ఆధారపడుతున్నారు.
అయితే ఇకపై తెల్ల జుట్టును కవర్ చేసేందుకు కలర్ అవసరం లేదు.ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ప్యాక్‌ను వేసుకుంటే న్యాచురల్‌గా వైట్ హెయిర్‌ను బ్లాక్‌గా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ ప్యాక్ ఏంటో తెలుసుకుందాం పదండీ.ముందు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకుని గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ కాస్త హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల మెంతుల పొడి, ఒక స్పూన్ లవంగాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు స్లో ఫ్లేమ్‌పై ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు వాటర్‌ను మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఆ తర్వాత వాటర్‌ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఐదారు స్పూన్లు హెన్నా పొడి, ఒక స్పూన్ పుల్లటి పెరుగు, ముందుగా తయారు చేసుకున్న వాటర్‌ను వేసుకుని మిక్స్ చేసుకుంటే ప్యాక్ సిద్ధమైనట్టే.ఈ ప్యాక్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని గంట అనంతరం మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి.అనంతరం జుట్టును తడి లేకుండా ఆరబెట్టుకుని రెగ్యులర్ ఆయిల్‌ను అప్లై చేసుకోవాలి.
మరుసటి రోజు మళ్లీ హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో ఒకే ఒక్క సారి చేస్తే కొద్ది రోజుల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
అదే సమయంలో జుట్టు రాలడం, పొట్లి పోవడం, చుండ్రు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.