ప్రస్తుతం చలి కాలం కొనసాగుతోంది.వాతావరణంలో వచ్చే పలు మార్పులు, చల్ల గాలులు కారణంగా ఈ సీజన్‌లో రకరకాల చర్మ సంబంధింత సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందరినీ చలి కాలంలో కామన్‌గా వేధించే సమస్య డ్రై స్కిన్.అయితే చర్మం పొడి బారి పోవడానికి వాతావరణంలో వచ్చే మార్పులే కాదు.
మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా కారణం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం చలి కాలంలో చర్మాన్ని ఇరకాటంలో పెట్టే ఆ చిన్న చిన్న పొరపాట్లు ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
సాధారణంగా కొందరు గంటలు తరబడి స్నానం చేస్తుంటారు.కానీ, చలి కాలంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువసేపు స్నానం చేయకూడదు.
ఎందు కంటే, స్నానం ఎక్కువ సమయం పాటు చేయడం వల్ల చర్మంపై ఉన్న తేమ అంతా తొలగిపోతుంది.దాంతో చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది.
అందుకే వింటర్‌లో సూపర్ క్విక్‌గా బాత్‌ను కానిచ్చేయాలి. స్నానం అనంతరం స్కిన్‌కి సూట్ అయ్యే లోషన్లు, మాయిశ్చరైజర్లను తప్పకుండా వాడాలి.
అలాగే చాలా మంది చలిని తట్టుకోలేక ఇంట్లో హీటర్‌ను ఉపయోగిస్తుంటారు.కానీ, తరచూ రూమ్ హీటర్స్‌ను వాడటం వల్ల శరీరంలో నీటి శాతం మొత్తం తగ్గి పోతుంది.
దాంతో బాడీ డీహైడ్రేట్ అవ్వడమే కాదు.చర్మం డ్రైగా మారి పోతుంది.

కొందరు చలి కాలమే కదా అని సన్ స్క్రీన్‌ను ఎవైడ్ చేస్తుంటారు.కానీ, కాలం ఏదైనా సన్ స్క్రీన్‌ను తప్పకుండా వాడాలి. సన్ స్క్రీన్ అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.మరియు పొడి చర్మం, ముడతలు, మచ్చలు వంటి చర్మ సంబంధిత సమస్యలు దరి చేరకుండా అడ్డు కట్ట వేస్తుంది.
ఆహారపు అలవాట్లు కూడా చర్మాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తాయి.ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ వంటి ఆహారాలు చర్మంలోని తేమను అంతా పీల్చేస్తాయి.
అందుకే వీటికి దూరంగా ఉంటూ.విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి.
తద్వారా చర్మం తేమగా మారుతుంది.