జలుబు.వింటర్ అండ్ రైనీ సీజన్స్‌లో దాదాపు ప్రతి ఒక్కరూ కామన్‌గా ఫేస్ చేసే సమస్య ఇది.కానీ, ప్రస్తుత వేసవి కాలంలోనూ కొందరిని జలుబు వేధిస్తుంటుంది.ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ చిట్కాలను ప్రయత్నిస్తే చాలా సులభంగా వేసవిలో ఇబ్బంది పెట్టే జలుబుకు చెక్ పెట్టవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
అత్తిపండ్లు.
ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే జలుబును నివారించే సామర్థ్యం కూడా అత్తిపండ్లకు ఉంది.
అవును, రెండు లేదా మూడు అత్తిపండ్లను నైట్ నీటిలో నానబెట్టుకోవాలి.ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాటర్‌తో సహా నానబెట్టుకున్న అతిపండ్లను తినాలి.
ఇలా చేస్తే జలుబు చాలా త్వరగా తగ్గు ముఖం పడుతుంది.
అలాగే జలుబుకు దానిమ్మ-అల్లం కాంబినేషన్ డ్రింక్ ఓ న్యాచురల్ మెడిసిన్‌లా పని చేస్తుంది.
ఒక గ్లాస్ దానిమ్మ రసం తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం జ్యూస్ కలిపి సేవించాలి.ఇలా రోజుకు ఒకసారి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

జలుబు చేసినప్పుడు శ్వాస మార్గం బ్లాక్ అయిపోతుంటుంది.దాంతో సరిగ్గా ఊపిరాడక తెగ ఇబ్బంది పడుతుంటారు.అలాంటప్పుడు నీటిలో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మరిగించి.ఆవిరి పట్టాలి.ఇలా చేస్తే శ్వాస మార్గం క్షణాల్లో ఫ్రీ అవుతుంది.జలుబు కూడా త్వరగా తగ్గుతుంది.

ఇక ఒక బౌల్‌లో గ్లాస్ వాటర్ పోసి చిన్న అల్లం ముక్క, రెండు దంచిన యాలకులు, హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి, చిటికెడు మిరియాల పొడి, చిన్న దాల్చిన చెక్క వేసి బాగా మరిగించి వాటర్‌ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్‌లో వన్ టేబుల్ స్పూన్ తేనెను కలిపి సేవించినా జలుబు సమస్య తగ్గుముఖం పడుతుంది.