టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్( Akkineni Akhil ) ఒక భారీ విజయాన్ని అందుకుంటే చూడాలి అని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.కానీ ఎప్పటికప్పుడు అభిమానుల ఆశలు ఆవిరి అవుతూ వస్తున్నాయి.
ఇప్పటివరకు తెలుగులో అఖిల్ ఐదు సినిమాలలో నటించగా అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్( Most Eligible Bachelor ) సినిమా తప్ప మిగతావేవీ కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయాయి.ఇక ముఖ్యంగా గత సినిమా ఏజెంట్ మూవీ( Agent Movie ) అయితే భారీ డిజాస్టర్ గా నిలిచింది.
ఈ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా కూడా ఇప్పటివరకు అఖిల్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ రాకపోవడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.

దీంతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.అయితే వారి నిరాశకు త్వరలోనే శుభం కార్డు పడబోతోందట.అఖిల్ ఒకేసారి మూడు ప్రాజెక్ట్ లతో సర్ ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఏజెంట్ తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ ఒక సినిమా కమిట్ అయ్యాడు.అనిల్ అనే నూతన దర్శకుడితో వంద కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాని ప్లాన్ చేశారట.
కానీ ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని టాక్.
అలాగే మురళి కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో కూడా అఖిల్ ఒక సినిమా కమిట్ అయ్యాడట.

నాగార్జున నిర్మిస్తున్న ఈ రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీకి లెనిన్ అనే టైటిల్ ప్రచారంలో ఉందట.అంతేకాకుండా అనౌన్స్ మెంట్ లేకుండానే సైలెంట్ గా ఈ మూవీ షూట్ జరుగుతున్నట్లు వార్తలు వినిపిన్నాయి.ఈ ఏడాదిలోనే లెనిన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే తాజాగా అఖిల్ మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.సామజవరగమన మాటల రచయిత నందు సవిరిగాన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట.శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనున్న ఈ మూవీ సామజవరగమన సినిమా తరహాలోనే ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం.కాగా ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు ఉంది.
ఆ రోజున ఈ మూడు ప్రాజెక్ట్ లకి సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.