వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే మీ జుట్టు విపరీతంగా పెరగడం పక్కా..!

సాధారణంగా కొందరులో హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది సరిగ్గా ఉండదు.దీనివల్ల జుట్టు ఊడిపోతుంది.

 If You Use This Oil Twice A Week Your Hair Will Grow Exponentially Details, Hom-TeluguStop.com

కానీ కొత్త జుట్టు అనేది రాదు.ఫలితంగా కురులు రోజురోజుకు పల్చగా మారుతుంటాయి.

ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా పెంచుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ సూపర్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.

వారానికి కేవలం రెండుసార్లు ఈ ఆయిల్ ను వాడడం అలవాటు చేసుకుంటే వద్దన్నా కూడా మీ జుట్టు విపరీతంగా పెరగడం పక్కా.మరి ఇంతకీ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహించే ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు కరివేపాకు,( Curry Leaves ) ఒక కప్పు వేపాకు,( Neem Leaves ) వన్ టీ స్పూన్ లవంగాలు( Cloves ) వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) పోసుకోవాలి.

ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు, వేపాకు, లవంగాల మిశ్రమాన్ని వేసి చిన్న మంటపై దాదాపు పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Coconut Oil, Curry, Extreme, Care, Care Tips, Oil, Healthy, Homemade Oil,

పూర్తిగా కూల్ అయ్యాక ఈ ఆయిల్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ ఆయిల్ అనేది రెడీ అవుతుంది.ఒక బాటిల్ లో ఈ ఆయిల్ ను స్టోర్ చేసుకోవాలి.కురుల ఆరోగ్యానికి ఈ ఆయిల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఆయిల్ ను అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.

Telugu Coconut Oil, Curry, Extreme, Care, Care Tips, Oil, Healthy, Homemade Oil,

ఆయిల్ రాసుకున్న మరుసటి రోజు తేలిక పాటి షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాలి.వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ కనుక వాడితే జుట్టు రాలే సమస్య దూరం అవుతుంది.ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.కురులు దట్టంగా మారతాయి.హెయిర్ గ్రోత్ లేదని బాధపడుతున్న వారికి ఈ ఆయిల్ కచ్చితంగా ఉపయోగపడుతుంది.కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube