ప్రస్తుత కరోనా సమయంలో ఇమ్యూనిటీని పెంచుకొనే పదార్థాల వైపు జనం ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.కరోనా తీవ్రత అధికమవుతుండడం వల్ల ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునే పనిలో పడ్డారు.
ఒకవైపు రోజురోజుకు కరోనా కేసులు తీవ్రమవుతుడంతో పాటు, కాలంలో మార్పులకనుగుణంగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటం ద్వారా వైరస్ ప్రభావం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీపవర్ పెంచుకోవటం ఒక్కటే మార్గమని నిపుణులు తెలియజేస్తున్నారు.
అయితే కొన్ని రకాల పండ్లను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు….
నారింజ సిట్రస్ జాతికి చెందిన పండు కావడం వల్ల ఇందులో విటమిన్ సి అధికంగా లభిస్తుంది.
విటమిన్ సి పుష్కలంగా మన శరీరానికి అందడం ద్వారా ఇమ్యూనిటీపవర్ పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది.నారింజ పండ్లను వీలైనంతవరకు జ్యూస్ రూపంలో తాగడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
ప్రతిరోజు నారింజ పండ్లు తీసుకోవడం ద్వారా కఫం, వాతం, జీర్ణక్రియ వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
ప్రతి రోజూ ఒక ఆపిల్ పండును తీసుకోవడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం ఉండదు అన్న విషయం ముమ్మాటికి నిజమే.
ఆపిల్ పండ్లను ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా ఎన్నో విలువైన పోషకాలు మన శరీరానికి అందుతాయి.ఇందులో పీచు పదార్థాలు, విటమిన్ సి, విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంలో ను, ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి విటమిన్ సి ఉపయోగపడితే, విటమిన్ కె అధికంగా ఉండటం వల్ల రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది.
దానిమ్మ పండు మన రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది.మన శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ తో పోరాడటానికి అవసరమైన పోషకాలు దానిమ్మ పండులో పుష్కలంగా లభిస్తాయి.
ఏవైనా గాయాలు తగిలినప్పుడు అవి తొందరగా మానడానికి దానిమ్మ తోడ్పడుతుంది.ప్రతిరోజు దానిమ్మ తీసుకోవడం వల్ల ఎటువంటి చర్మ సమస్యలు కూడా తలెత్తవు.
జామపండులో విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల,జీర్ణక్రియ రేటు మెరుగుపరచడంమే కాకుండా మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.
దంత సమస్యలతో బాధపడే వారికి జామ ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది.ఇందులో విటమిన్ సి,ఐరన్,క్యాల్షియం అధికంగా ఉండటం ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి.
ఇలాంటి పళ్లను ప్రతిరోజు మన ఆహారపదార్థంలో భాగంగా చేసుకోవడం ద్వారా మన శరీరానికి కావల్సినంత ఇమ్యూనిటీపవర్ పెరగడమే కాకుండా, అనేక రకాల వ్యాధులతో పోరాడటానికి దోహద పడతాయి.