అమెరికా సహా వివిధ దేశాలలో వలస పరిమితుల కారణంగా అంతర్జాతీయ విద్యా అవకాశాలపై పెరుగుతున్న అనిశ్చితి మధ్య భారతీయ విద్యార్ధులు విదేశాలకు వెళ్లడం కలగా మారింది.తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అంత దూరం పంపించడానికి కూడా ఇష్టపడటం లేదు.
ఇండియాలోనే కాస్త పేరున్న విద్యాసంస్థల్లో పంపించడానికి ప్రయత్నిస్తున్నారు.సాధారణంగా ప్రతి ఏడాది విద్యా సంవత్సరంలో సెమిస్టర్ అధికారికంగా ప్రారంభమైన తర్వాత.
ఖచ్చితమైన అడ్మిషన్ వివరాలు సెప్టెంబర్ నాటికి మాత్రమే తెలుస్తాయి.అయితే పంజాబ్‌లోని( Punjab ) పలు విద్యాసంస్థల్లో ఇప్పటికే అడ్మిషన్ల కోసం దరఖాస్తులు గణనీయంగా పెరిగాయి.12వ తరగతి ఫలితాల కోసం విద్యార్ధులు ఇంకా ఎదురుచూస్తున్నప్పటికీ.సీట్ల లభ్యత, ఫీజులు, కోర్సుల గురించి తెలుసుకోవడానికి ఆయా కళాశాలలకు నిరంతరం ఈ మెయిల్స్, కాల్స్ వస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు విద్యారంగంపై పెను ప్రభావం చూపుతున్నాయి.పంజాబీల ఫేవరెట్ డెస్టినేషన్‌గా ఉన్న కెనడాలోనూ ఇటీవల అంతర్జాతీయ విద్యార్ధుల( International students ) అనుమతులపై పరిమితిని విధించింది అక్కడి ప్రభుత్వం.ఆస్ట్రేలియా సైతం తన వీసా విధానాన్ని ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలతో మరింత కఠినతరం చేసింది.వీసా సమ్మతి సమస్యలపై అమెరికాలో భారతీయ విద్యార్ధుల బహిష్కరణలు పెరిగాయి.ఈ పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపకుండా జాగ్రత్త పడేలా చేస్తోంది.

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ( Russia – Ukraine war )కూడా తల్లిదండ్రులకు విదేశీ విద్యా విధానంపై అవగాహన పెంచడంలో కీలకపాత్ర పోషించింది.యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుని .తర్వాత సురక్షిత ప్రాంతాలకు తరలించబడిన వందలాది మంది భారతీయ విద్యార్ధులు ఎదుర్కొన్న కఠిన పరీక్ష ప్రజల జ్ఞాపకాలలో ఇప్పటికీ ఉంది.సొంతూరికి దగ్గరలోనే ఉన్నత విద్యను అభ్యసించడం సురక్షితమైన, స్థిరమైన ఎంపిక అని ఇప్పుడు చాలా మంది విశ్వసిస్తున్నారు.తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
విదేశాల్లో రిస్క్ ఎదుర్కొనే బదులు ఇక్కడే నాణ్యమైన విద్యను తమ పిల్లలకు అందించాలని భావిస్తున్నారని వారు అంటున్నారు.