ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా వివిధ ఘటనలు వైరల్( Viral ) అవుతున్నాయి.ఏ వ్యక్తి ఏమి చేస్తున్నాడో, ఎవరి జీవితం ఏ మలుపు తిరుగుతోందో అనేది కొన్ని సెకన్లలోనే ప్రపంచానికి తెలిసిపోతోంది.
తాజాగా అలాంటి ఓ వైరల్ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.ఈ ఘటనలో ఒకవైపు అఘోరీ నాగ సాధువు,( Aghori Nagasadhu ) మరోవైపు ఓ యువతి.
ఇద్దరి మధ్య జరిగిన వివాహం ఇప్పుడు సంచలనంగా మారింది.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్( Srinivas ) అనే యువకుడు పేదరికంలో పుట్టి, ఓ దశలో ఇంటి నుంచి పారిపోయాడు.
అనంతరం దేశం మొత్తం తిరుగుతూ సన్యాసం తీసుకున్నాడు.ఒక్కసారిగా జీవన విధానాన్ని మార్చుకుని నాగ సాధువుగా మారాడు.మహిళల వేషధారణతో శ్మశానాల్లో సంచరిస్తూ.సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో పలు ప్రాంతాల్లో హల్‌చల్ చేశాడు.
తిరుమల, విజయవాడ, వేములవాడ వంటి పవిత్ర క్షేత్రాల్లో కనిపించి భక్తులను భయపెట్టిన ఘటనలు గతంలో వార్తల్లోకి వచ్చాయి.ఈ క్రమంలోనీ ఆ నాగసాధు, మంగళగిరికి చెందిన యువతి శ్రీవర్షిణితో( Srivarshini ) పరిచయం పెంచుకున్నాడు.శ్రీవర్షిణి, ఓ సందర్భంలో నందిగామలో అఘోరీకు సహాయం చేయడంతో ఆ పరిచయం ప్రేమగా మారింది.ఆ తర్వాత ఆ అమ్మాయిని గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతానికి తీసుకెళ్లాడు.ఇది గమనించిన యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో వారు స్వయంగా గుజరాత్‌కు వెళ్లి శ్రీవర్షిణిని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు.
అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా శ్రీవర్షిణి నాగసాధువుతో సంభాషణ కొనసాగించింది.ఇటీవల మరలా చెప్పాపెట్టకుండా ఇంటినుంచి పారిపోయింది.రెండు రోజుల క్రితం మళ్లీ నాగసాధుతో కలిసి మధ్యప్రదేశ్‌లోని ఓ ఆలయంలో వివాహం చేసుకుంది.
ఆలయంలో బంధుమిత్రులు లేకుండా, భక్తుల సమక్షంలో నాగసాధు శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు వేసాడు.దండలు మార్చుకోవడం, తలంబ్రాలు, ఏడడుగులు వేసే విధంగా సంప్రదాయ రీతి పాటించారు.
ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.వీటిలో ఇద్దరూ ఆనందంగా ఉన్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది.