టాలీవుడ్ నుంచి ఎంతో మంది హీరోలు బాలీవుడ్ బాట పట్టారు.అక్కడ తమ సత్తా చాటుతున్నారు.
బెల్లంకొండ నుంచి మొదలుకొని సత్యదేవ్ వరకు హిందీలో అడుగు పెట్టారు.ఇప్పటికే పలువురు తెలుగు హీరోలు బాలీవుడ్ లో నటించారు.
ఇంతకీ సౌత్ నుంచి నార్త్ కు వెళ్లిన నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభాస్ ఛత్రపతి సినిమాను బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో వివి వినాయక్ హిందీలో రీమేక్ చేస్తున్నారు.
హీరోగా బెల్లంకొండకు.దర్శకుడిగా వినాయక్‌కు ఇదే తొలి బాలీవుడ్ మూవీ.
బాలీవుడ్ ఛత్రపతిగా బెల్లంకొండ మూవీ ఎలా ఆడుతుందో చూడాలి.అటు అమీర్ ఖాన్ హీరోగా చేస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగ చైతన్య కీ రోల్ చేస్తున్నాడు.
అమీర్, నాగ చైతన్య ఇందులో సైనికులుగా కనిపిస్తున్నారు.అక్షయ్ కుమార్ మూవీ రామ్ సేతులో సత్యదేవ్ నటిస్తున్నాడు.
అటు ప్రభాస్ బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు.అనంతరం సాహోతో బాలీవుడ్‌లో దుమ్మురేపాడు.ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడిగా నటిస్తుండగా.
క్రితి సనన్ సీతగా యాక్ట్ చేస్తుంది.ప్రభాస్ కంటే ముందు రానా.
హిందీలో దమ్ మారో దమ్, డిపార్ట్ మెంట్, బేబి, ఏ జవానీ హై దీవానీ, ఘాజీ, హౌస్‌పుల్-4 సహా పలు సినిమాలు చేశాడు.రామ్ చరణ్ కూడా జంజీర్ పేరుతో రీమేక్ చేసి డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఆగ్యాత్ మూవీలో నటించాడు నితిన్.1992 లో అమితాబ్ తో కలిసి.ఖుదాగవా సినిమాలో నటించాడు నాగార్జున.ఇప్పటి వరకు 10కి పైగా హిందీ సినిమాల్లో నటించాడు.

అంకుశం సినిమాను హిందీలో ప్రతిబంద్ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు చిరంజీవి.తెలుగులో మంచి విజయం సాధించిన చంటి మూవీని.అనారీ టైటిల్ తో హిందీలో రీమేక్ చేసి విజయం సాధించాడు వెంకటేష్.
తెలుగులో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో నటించిన నవీన్ పోలీశెట్టి.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన చిచ్చోరే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.విజయ్ దేవరకొండ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.పుష్ప సినిమాతో అల్లు అర్జున్ తొలిసారి ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.
త్రిపుల్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు ఎన్టీఆర్.అటు సీనియర్ ఎన్టీఆర్ హిందీలో చండీరాణి, నయా ఆద్మీ సినిమాలతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
అక్కినేని కూడా తెలుగులో హిట్టైన సువర్ణ సుందరి సినిమాను అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేసి విజయం సాధించాడు.కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, జీవా, బ్రహ్మానందం, బెనర్జీ, సత్యనారాయణ, రాజనాల సహా పలువురు తెలుగు నటులు బాలీవుడ్ లో సినిమాలు చేశారు.