ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచదేశాల ప్రజలను ముప్పతిప్పులు పెడుతున్న విషయం తెలిసిందే.ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు.
ఎప్పుడు అంతం అవుతుందో తెలియని కరోనా.రోజురోజుకు భారీ స్థాయిలో విజృంభిస్తోంది.
అయితే కరోనా నుంచి రక్షించుకోవాలంటే శరీర రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అయితే రోగ నిరోధక శక్తి పెంచడంలో తమలపాకులు కూడా ఎంతో చక్కగా ఉపయోగపడతాయి.
ఇందులో ఉండే విటమిన్ సి, ఎ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ బలపడటానికి తోడ్పడతాయి.తద్వారా కరోనా వంటి భయంకర వైరస్‌ల నుంచి రక్షణ పొందొచ్చు.అందుకే వారానికి రెండు తమలపాకులు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. తమలపాకుల వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడేవారికి తమలపాకులు గొప్ప ఔషధంలా పనిచేస్తాయి.తమలపాకులను తీసుకుని.మెత్తగా నూరి రసం తీసుకోవాలి.ఈ రసాన్ని మూడుపూటలా టీ స్పూన్ చోప్పున తీసుకుంటే జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు నయం అవుతాయి.ఎముకులను దృఢంగా చేసే కాల్షియం కూడా తమలపాకుల్లో ఉంటుంది.
అలాగే తమలపాకును భోజనం తర్వాత తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
బరువు తగ్గించేందుకు కూడా తమలపాకు ఉపయోగపడుతుంది.ఇక తమలపాకును కొన్ని మిరియాలతో కలపి ప్రతిరోజు తీసుకుంటే.
శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది.గుండె జబ్బులను కూడా తమలపాకు నివారించగలదు.
అయితే తమలపాకులు తినేటప్పుడు తొడిమ తొలగించి తీసుకుంటే మంచిది.