అదృష్టం ఎవరి తలుపు ఎప్పుడు తడుతుందో తెలియదు.ఆ వచ్చిన అకాశాన్నిసద్వినియోగం చేసుకున్న వాళ్లే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.
సేమ్ అలాగే తమకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని మంచి గుర్తింపు పొందారు పలువురు టాలీవుడ్ హీరోయిన్లు.కొంత మంది సినీ బ్యాగ్రౌండ్ నుంచి వస్తే.
మరికొంత మంది ఎలాంటి సినీ పరిచయం లేకుండా వెండితెరై మెసినవాళ్లూ ఉన్నారు.ఊహించని రీతిలో అవకాశం పొంది మంచి గుర్తింపు పొందారు.వారిలో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
కీర్తి సురేష్:

ఈమె తల్లి మేనక నాటి మేటి నటి.ఆ కారణంగానే సినిమా రంగంలోకి ఈజీగా అడుగు పెట్టింది కీర్తి సురేష్.చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తర్వాత.2013లో మలయాళంలో గీతాంజలి మూవీతో హీరోయిన్‌గా మారింది.నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
నివేథా థామస్:

స్కూల్‌లో చదువుతున్నరోజుల్లోనే ఈమెకు సినిమాల్లో అవకాశం వచ్చింది.మలయాళం సినిమాలో చేసిన చిన్న పాప క్యారెక్టర్ కేరళ ప్రభుత్వ అవార్డును సైతం అందేలా చేసింది.జెంటిల్మెన్ సినిమాతో తెలుగులోకి వచ్చిన ఈమె.ప్రస్తుతం మంచి హీరోయిన్‌గా కొనసాగుతోంది.
మెహరిన్:

ఈమెకు అనుకోకుండా సినిమ అవకాశం వచ్చింది.కెనడాలో జరిగిన నార్త్ ఇండియా అమ్మాయిల అందాల పోటీల్లో పాల్గొనాలని మెహరిన్‌ను తల్లి ఎంకరేజ్ చేసింది.ఆ టైటిల్ గెలిచిన ఈ అమ్మాయికి చాలా కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చాయి.
తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకున్నాయి.మోడల్‌గా చేస్తున్న ఈమెకు కృష్ణ గాడి వీర ప్రేమగాథ సినిమాలో అవకావం దక్కింది.
సాయి పల్లవి:

ఈమె మంచి డాన్సర్.చిన్నప్పటి నుంచి పలు టీవీషోల్లో వచ్చిన డాన్స్ షోల్లో పాల్గొన్నది.అప్పుడు సినిమా ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది.మలయాళం సినిమా ప్రేమమ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
అనుపమ పరమేశ్వరన్:

ఈమె సినిమాల్లోకి రావడం కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదట.ప్రేమమ్ సినిమా ఆడిషన్స్‌కి ఫోటోలు పంపిన విషయం ఇంట్లో తెలిసి.పెద్ద గొడవ పెట్టుకున్నారట.
అయినా తను ప్రేమమ్ సినిమాలో అవకాశం పొంది.మంచి విజయం సాధించింది.ఆతర్వాత చక్కటి సినిమాలత సక్సెస్ ఫుల్‌గా ముందుకు సాగుతుంది.
రాశి ఖన్నా:

వ్యాజిలెన్ కంపెనీ ఫోటోషూట్‌లో పాల్గొని సినిమా అవకాశం దక్కించుకుంది ఈ బొద్దుగుమ్మ.ఆమె చదివే ఒక కాలేజీలో అమ్మాయిలకు ఒక ఫోటో షూట్ నిర్వహించారు.అందులో పాల్గొన్న అమ్మాయిలకు వ్యాజిలెన్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు.
అందులో రాశీకూడా పాల్గొన్నది.ఈ ఫోటో ఓ మ్యాగజైన్ మీద ముద్రించారు.
ఆ ఫోటోతో చాలా కంపెనీలు ఆమెను తమ మోడల్‌గా సెలెక్ట్ చేసుకున్నాయి.ఆ సమయంలోనే తమిళంలో అవకాశాలు వచ్చాయి.
తెలుగులో ఊహలు గుసాగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.