ఉల్లి తొక్కలను పడేస్తున్నారా? వాటిని ఇలా వాడితే పొడవాటి జుట్టు మీ సొంతమవుతుంది!

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లల్లోనూ రెగ్యులర్ గా ఉల్లిపాయల‌ను వాడుతుంటారు.ఎందుకంటే.

 How To To Use Onion Peel For Long Hair! Onion Peel, Onion Peel Benefits, Latest-TeluguStop.com

ఉల్లిపాయ లేనిదే ఏ కూర చేయలేరు.అయితే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే ఉల్లిపాయ తొక్కలను పడేస్తుంటారు.

లేదా డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.కానీ ఉల్లిపాయలే కాదు ఉల్లి తొక్కలు కూడా మనకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి.

ముఖ్యంగా జుట్టు సంరక్షణకు ఉల్లి తొక్కలు చేసే మేలు అంతా ఇంతా కాదు.ఎవరైతే పొడవాటి జుట్టును కావాలని కోరుకుంటున్నారో వారికి ఉల్లితొక్కలు గ్రేట్ గా సహాయపడతాయి.

ఇంతకీ ఉల్లి తొక్కలను జుట్టుకు ఏ విధంగా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక కప్పు ఉల్లి తొక్కలను వాటర్ లో కడిగి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్‌ వాటర్ పోయాలి.వాటర్ బాగా హిట్ అయిన తర్వాత అందులో కడిగి పెట్టుకున్న ఉల్లి తొక్కలను వేసుకోవాలి.

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి వేసి కనీసం ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదాన్ని వేసి బాగా మిక్స్ చేస్తే అద్భుతమైన హెయిర్ టోనర్ సిద్ధం అవుతుంది.ఈ హెయిర్ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.

జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు తయారు చేసుకున్న టోనర్ ను రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాలి.ఉల్లి తొక్కల తో తయారు చేసిన ఈ టోనర్ ను వాడ‌టం వ‌ల్ల‌ హెయిర్ గ్రోత్‌ అనేది సూపర్ గా ఇంప్రూవ్ అవుతుంది.కొద్ది రోజుల్లోనే జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగడం ప్రారంభమవుతుంది.

అలాగే చుండ్రు సమస్యను నివారించడానికి కూడా ఈ హెయిర్ టోనర్ ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.కాబట్టి ఇకపై ఉల్లి తొక్కలను పారేయడం ఆపేసి ఇలా జుట్టు సంరక్షణకు ఉపయోగించడం ప్రారంభించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube