ప్రతి రోజూ ఉదయాన్నే గుడ్ మార్నింగ్‌కు బదులుగా నేను, నా భర్త ఒకరికొకరం ఐ లవ్ యూ చెప్పుకుంటాం.ఆయన లవ్ యూ మై వైఫ్ అంటారు.
తరువాత కొన్ని కిసెస్.ఇలా మా రోజు ప్రారంభమవుతుంది.
ఒక వేళ సండే అయితే ఉదయాన్నే నేను టీ, బ్రేక్‌ఫాస్ట్ చేస్తా.అదే వర్కింగ్ డే అయితే నేను బ్రేక్‌ఫాస్ట్ చేసి, లంచ్ బాక్స్‌లు పెడుతుంటే.
ఆయన ఇల్లు క్లీన్ చేస్తారు.ఇక బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ మేం ఆ రోజు చేయబోయే పనుల గురించి చర్చిస్తాం.
సండే అయితే ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు ఏదైనా ట్రిప్ వేస్తాం.లేదా ఇంట్లోనే జాలీగా గడుపుతాం.
ఇంటి దగ్గర నేను, నా భర్త ఇద్దరం ఉంటే ఆయన బయటకు వెళ్తే నన్ను ఇంట్లో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లరు.నాకు కిచెన్‌లోనూ ఆయన సహాయం చేస్తారు.ఇద్దరం పలు టాపిక్‌లపై కిచెన్‌లోనే మాట్లాడుకుంటాం.ఆయన నాతో ఎప్పుడూ అంటుంటారు.నువ్వు నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేను ఇదంతా సాధించి ఉండకపోయేవాన్నేమో.అంటారు.
నా జీవితంలో నీకు ముఖ్య భాగం ఉంది అంటారాయన.ఒక్కోసారి ఆయన నాకు చిన్నపాటి గిఫ్ట్‌లను తీసుకువచ్చి సర్‌ప్రైజ్ చేస్తారు.
చిన్న ట్రిప్‌లకు ప్లాన్ చేసి షాక్‌లు ఇస్తారు.లేదా ఒక్కోసారి ఇంట్లోనే ఇద్దరం క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తాం.
మా ఇద్దరికీ సంగీతం అంటే పిచ్చి.ఇద్దరం ఒకే రకమైన సంగీతం వింటాం.ఒక్కోసారి ఇద్దరం కలసి డ్యాన్స్ కూడా చేస్తాం.ఇద్దరం జోక్స్ చెప్పుకుంటాం.
కలసి నవలలు చదువుతాం.ఒక్కోసారి ఆయన నవలలు చదివి నాకు వాటిలో ఉన్న కథను వివరిస్తారు.
ఇద్దరం అప్పుడప్పుడు షార్ట్ రొమాంటిక్ వాక్స్‌కు వెళ్తుంటాం.లేదా లాంగ్ డ్రైవ్‌లకు ప్లాన్ చేస్తాం.
ఇద్దరం భార్యభర్త, గర్ల్‌ఫ్రెండ్-బాయ్ ఫ్రెండ్‌లా కాకుండా స్నేహితుల్లా ఉంటాం.ఇద్దరిలో ఎవరికైనా క్రేజీ ఐడియా వస్తే దాన్ని ఒకరితో ఒకరం షేర్ చేసుకుంటాం.
నేను వండిన వంట బాగా కుదిరితే నన్ను ఆయన బాగా మెచ్చుకుంటారు.అదే వంట బాగా లేకపోతే మాత్రం తిట్టరు.
జోక్ కూడా చేయరు.నాపై ఆయన కవితలు కూడా రాస్తుంటారు.
జబ్ తేరీ కహానీ మే మేరా నామ్ నహీ హోతా ఆయన రాసిన కవితల్లో నాకు బాగా నచ్చిన కవిత.
ఆయన నాతో.గులు తుమ్ బహుత్ అచ్చీ హో.అంటే నాకు ఆయన ఎంతో విలువ ఇస్తున్నాడని తెలుసుకుని చాలా గర్వంగా ఫీల్ అవుతా.నాకు అనారోగ్యం వస్తే నన్ను ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటారు.నాకు పీసీఓఎస్ ప్రాబ్లం ఉండేది.అప్పుడు నా డైట్ విషయంలో ఆయన ఎంతో జాగ్రత్త తీసుకున్నారు.తక్కువ రైస్ తినడంతోపాటు రోజుకు కనీసం ఒక పండు, ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్, రోజూ తగినన్ని నీళ్లు తాగేలా చూశారు.
రోజూ 15 నిమిషాల పాటు నాతో వ్యాయామం చేయించేవారు.నాకు ఓసీడీ ఉండేది.
దాన్ని అధిగమించేందుకు ఆయన నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు.
ఆయన పూణెలో ఉన్నప్పుడు ఒక సారి నేను చూసేందుకు వెళ్లా.
అప్పుడు నన్ను ఆయన రాత్రి బైక్‌పై రిసీవ్ చేసుకున్నారు.అప్పుడు నాకు లగేజ్ పట్టుకోవడం వల్ల భుజాలు బాగా నొప్పి పుట్టాయి.
దీంతో ఆయన నా కోసం కారు నేర్చుకున్నారు.కారు కొని తరువాత ఒకసారి నన్ను కారులో రిసీవ్ చేసుకున్నారు.
ఆయన నన్ను బాగా ప్రేమిస్తారు.ఆ విషయం నాకు బాగా తెలుసు.
నేను ఆయన కోసం చేసే దాని కన్నా.ఆయన నాకోసం చేసే పనులే ఎక్కువ.
ఆయన నా భర్త అయినందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని.!
.