సినిమాల నుండి ప్రేక్షకులు ఎంత మంచిని తీసుకుంటారో తెలియదు, కాని చెడును మాత్రం అత్యంత స్పీడ్‌గా యువత నేర్చుకుంటున్నారు.ఒకప్పుడు సినిమాల్లో ఎలాంటి కంటెంట్‌ను అయినా చూపించే వారు.
కాని ఇప్పుడు పరిస్థితి మారింది.తెలుగుతో పాటు అన్ని భాషల సినిమాల్లో కూడా ఫిల్మ్ మేకర్స్ పాజిటివ్ కంటెంట్‌ను ఇస్తున్నారు.
ప్రేక్షకులను నేరాలకు, ఘోరాలకు పాల్పడకుండా ప్రేరేపించకుండా ఉండేలా ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి.సెన్సార్ కూడా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ రూల్స్‌ను పాటిస్తుంది.
1978లో బాలచందర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన చిత్రంను తెలుగులో మరోచరిత్రగా విడుదల చేశారు.అప్పట్లోనే కాదు ఇప్పటికి కూడా ఆ సినిమా ఒక ఆణిముత్యం, అద్బుతమైన సినిమా.ఇండియన్ లవ్ సినిమాల జాబితాలో మరోచరిత్ర ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆ సినిమాలో హీరోగా కమల్ హాసన్ హీరోయిన్‌గా సరితలు నటించారు.ఇద్దరు ప్రేమించుకుంటారు.వారి ప్రేమ అద్బుతంగా ముందుకు సాగుతున్న సమయంలో వాళ్ల తల్లిదండ్రులు అడ్డుచెప్తారు.
వారిని ఒప్పించేందుకు, మెప్పించేందుకు సర్వశక్తులు ఒడ్డుతారు.చివరకు కూడా వారు ఒప్పుకోక పోవడంతో పెళ్లి చేసుకోలేము అనే నిర్ణయానికి వచ్చి చావే దిక్కు అనుకుంటారు.అలా ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకుంటారు.బ్యాడ్ ఎండింగ్ అయినా కూడా సినిమా కన్నీరు పెట్టించి మరీ బ్లాక్ బస్టర్ అయ్యింది.ఆ సినిమా సమయంలో ఎంతో మంది ఆ కథకు కనెక్ట్ అయ్యారు.సినిమా విడుదలైన 50 రోజుల లోపులోనే ఆ సినిమాను చూసిన ప్రేమికులు 40 మంది చనిపోయారు.20 జంటలు కూడా మరోచరిత్ర సినిమా చూసిన తర్వాత చనిపోయినట్లుగా అప్పుడు మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు అందింది.
ఆ సినిమాను బ్యాన్ చేయాలని, నిలిపేయాలంటూ ఫిర్యాదులు వచ్చాయి.ఆత్మహత్యల విషయమై 200వ రోజు వేడుకలో దర్శకుడు బాల చందర్ మాట్లాడుతూ ఇలాంటి సినిమా చేసినందుకు సిగ్గుగా ఉంది.నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు ఈ సినిమాను తీయడం అంటూ ఎమోషనల్‌గా వ్యాఖ్యలు చేశాడు.
ఇలాంటివి మళ్లీ చేయనంటూ ఆయన ప్రతిజ్ఞ చేశాడు.సినిమాల వల్ల ఎంతటి ప్రభావం ఉందో అప్పటి నుండే గుర్తింపు వచ్చింది.