తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుమ కనకాల ( Suma Kanakala ) ఒకరు.గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా కొనసాగుతూ ఉన్నారు.
ఏదైనా ఒక సినిమా పూజా కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఆ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమం వరకు సుమ యాంకర్( Anchor ) గా వ్యవహరిస్తూ ఉంటారు.మరి కొంతమంది హీరోలు సుమా డేట్స్ చూసుకొని మరి సినిమా వేడుకలను పెట్టుకుంటారు అంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో స్పష్టం అవుతుంది.
ఇలా యాంకర్ గా అందరినీ ఆకట్టుకున్న సుమానటిగా కూడా గతంలో బుల్లితెర సీరియల్స్ అలాగే సినిమాలలో కూడా నటించారు.ఇక ఇటీవల ఈమె ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయతీ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాలో సుమ నటనకు మంచి మార్కులే పడ్డప్పటికీ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఈ సినిమా మంచి సక్సెస్ కాకపోవడంతో సినిమా వెండితెరకు దూరంగా ఉంటారని అందరూ భావించారు కానీ ఈమె మాత్రం మరో సినిమా ద్వారా వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే సుమ తదుపరి నటించబోతున్న ప్రేమంటే ( Premante ) సినిమా పూజా కార్యక్రమాలు ఆదివారం ఎంతో ఘనంగా జరిగాయి.ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు.ఈ పూజా కార్యక్రమాలలో నటుడు రానా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.రానా ముహుర్తపు సన్నివేశానికి ఫస్ట్ క్లాప్ కొట్టగా.సందీప్ రెడ్డి వంగా కెమెరా స్విచ్చాన్ చేశారు.థ్రిలింగ్ అండ్ రోమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కమెడియన్ ప్రియదర్శి( Priyadarshi ) హీరోగా నటించబోతున్నారు.
ఇందులో సుమ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమా ద్వారా నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.