ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ముఖ చర్మం పై ఏదో ఒక విధంగా మచ్చలు( Spots ) ఏర్పడుతూనే ఉంటాయి.అయితే కొన్ని మచ్చలు కొద్దిరోజులకే మాయమైనా.
కొన్ని మాత్రం చర్మాన్ని అలానే అంటిపెట్టుకుని కూర్చుంటాయి.వాటిని చూసినప్పుడల్లా తీవ్రమైన అసౌకర్యానికి, ఆందోళనకు గురవుతుంటారు.
మచ్చలేని చర్మాన్ని పొందడం కోసం రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఈ చిట్కాతో మొండి మచ్చలకు సులభంగా బై బై చెప్పవచ్చు.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టమాటో స్లైసెస్,( Tomato slices ) రెండు కీర స్లైసెస్, రెండు బంగాళదుంప స్లైసెస్ ( Potato slices )మరియు రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టీ స్పూన్ పాలు మరియు సరిపడా టమాటో పొటాటో కీర జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
ముఖ్యంగా ఈ రెమెడీ మొండి మచ్చలను క్రమంగా మాయం చేస్తుంది.స్పాట్ లెస్ స్కిన్ ను మీ సొంతం చేస్తుంది.

అలాగే ఈ రెమెడీ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.డల్ స్కిన్‌ను ప్రకాశవంతంగా మార్చడానికి మరియు ఛాయను పెంచడానికి తోడ్పడుతుంది.అంతేకాకుండా ఈ రెమెడీ మొటిమలను నియంత్రిస్తుంది.బ్రేక్‌అవుట్‌లను తగ్గిస్తుంది.యూవీ కిరణాల నుండి రక్షిస్తుంది.చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో మరియు చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో కూడా హెల్ప్ చేస్తుంది.