సమోసాలు, బజ్జీలు కాదు వర్షాకాలంలో సాయంత్రం వేళ ఇవి తింటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు!

వర్షాకాలం రానే వచ్చింది.వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని అందిస్తూ వర్షపు చినుకులు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.

 Health Benefits Of Eating Corn During Monsoon Details, Corn, Corn Health Benefi-TeluguStop.com

ఈ వర్షాకాలంలో( Monsoon ) సాయంత్రం వేళ వేడివేడిగా సమోసాలు, బజ్జీలు తినడానికే ఎక్కువ శాతం మంది మక్కువ చూపుతారు.సమోసాలు, బజ్జీలు నోటికి రుచికరంగానే ఉన్నా ఒంటికి మాత్రం మంచివి కావు.

జీర్ణక్రియలో ఇబ్బందులను కలగజేస్తాయి.అలాగే మరెన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి.

అయితే బజ్జీలు, సమోసాలకు బదులుగా వర్షాకాలంలో సాయంత్రం వేళ ఇంట్లోనే ఉడికించిన లేదా కాల్చిన మొక్కజొన్న గింజలను తింటే ఆరోగ్యానికి తిరుగే ఉండదని నిపుణులు చెబుతున్నారు.

మొక్కజొన్న లో( Corn ) జింక్, మెగ్నీషియం, కాపర్, ఐరన్, మాంగనీస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

అలాగే ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్ వంటి పోషకాలు సైతం మొక్క‌జొన్న‌లో ఉంటాయి.ప్రస్తుత వర్షాకాలంలో సాయంత్రం వేళ మొక్కజొన్న ఉత్తమమైన స్నాక్ గా చెప్పుకోవచ్చు.మొక్క జొన్నలోని విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను( Immunity System ) బలపరుస్తుంది.సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

Telugu Corn, Corn Benefits, Corn Monsoon, Tips, Immunity System, Latest, Monsoon

బ‌రువు త‌గ్గాల‌ని( Weight Loss ) భావిస్తున్న వారికి మొక్కజొన్న ఎంతో ఉప‌యోక‌రంగా ఉంటుంది.ఎందుకుంటే మొక్క‌జొన్న‌లో క్యాలరీలు మరియు కొవ్వు తక్కువగా ఉంటుంది.ఫైబర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంటుంది.ఒక క‌ప్పు ఉడికించిన లేదా కాల్చిన మొక్క‌జొన్న గింజ‌లు తింటే ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన ఫీలింగ్ క‌లుగుతుంది.ఇది ఆకలిని నియంత్రించడంలో మరియు అతిగా తినడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.

Telugu Corn, Corn Benefits, Corn Monsoon, Tips, Immunity System, Latest, Monsoon

మొక్కజొన్న లో మెండుగా ఉండే కెరోటినాయిడ్స్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.వయసు సంబంధిత మచ్చల క్షీణత మరియు కంటిశుక్లం నుండి కళ్ళను రక్షించడంలో అద్భుతంగా తోడ్ప‌డ‌తాయి.అలాగే నీర‌సంగా ఉన్న‌ప్పుడు మొక్కజొన్న గింజ‌లు తింటే అందులోని కార్బోహైడ్రేట్లు త‌క్ష‌ణ శక్తిని అందిస్తాయి.

మొక్కజొన్నలో ఫోలేట్, పొటాషియం మరియు ప్లాంట్ స్టెరాల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి.ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.రక్తపోటును నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి.గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇక మొక్క‌జొన్న‌లోని ఫైబ‌ర్ కంటెంట్ జీర్ణ‌క్రియ మ‌ద్ద‌తు ఇస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube