జ్యోతిర్లింగం అంటే ఏమిటి? అవి ఎక్క‌డెక్క‌డ ఉన్నాయో తెలిస్తే...

దేశంలోని ప్రతి దిశలో స్థాపిత‌మైన‌ జ్యోతిర్లింగాలు భారతదేశాన్ని ఆధ్యాత్మికత అనే తాడుతో ముడివేస్తాయి.ఎక్కడైతే మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడో అక్కడ ఒక దివ్య జ్యోతిర్లింగం ప్ర‌తిష్టిత‌మ‌య్యింద‌ని భ‌క్తులు నమ్ముతారు.

 What Is Jyotirlingam Do You Know Where They Are Details, Jyothirlingam, 12 Jyoth-TeluguStop.com

శివుడు అధికంగా తన లింగ రూపంలో పూజ‌లందుకుంటాడు.ఈ లింగ రూపంలో భగవంతుడు కాంతి రూపంలో ఉన్నాడని భ‌క్తులు నమ్ముతారు.

దీనినే జ్యోతిర్లింగంగా పిలుస్తారు.పురాణాలలో శివుని 12 జ్యోతిర్లింగాల గురించిన‌ ప్రస్తావ‌న క‌నిపిస్తుంది.

జ్యోతిర్లింగాలు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయి?

భూమిపై శివుని మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగమని నమ్ముతారు.సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని చంద్రదేవ్ స్వయంగా స్థాపించాడని చెబుతారు.

దీని తరువాత ఆంధ్ర ప్రదేశ్‌లో కృష్ణా నది ఒడ్డున ఉన్న మల్లికార్జున జ్యోతిర్లింగం 2వ స్థానంలో ఉంది.గ్రంథాలలో, మల్లికార్జున జ్యోతిర్లింగం కైలాస పర్వతం అని వర్ణించారు.

మూడవ స్థానంలో మధ్యప్రదేశ్‌కు మతపరమైన రాజధాని ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉంది.దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం.

మహాకాళేశ్వరుని పూజించడం వల్ల ఆయురారోగ్యాలు పెరుగుతాయని, కష్టాలు నివార‌ణ అవుతాయ‌ని నమ్మకం.మహాకాళేశ్వర జ్యోతిర్లింగ భస్మహార‌తిలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుండి భ‌క్తులు ఇక్క‌డికి త‌ర‌లివ‌స్తారు.

Telugu Jyothirlingas, Jyothirlingam, Maha Shivaratri-Latest News - Telugu

ఇండోర్‌లోని నర్మదా ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగానికి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఉన్న ప్రదేశంలో నర్మద గొడుగు ఆకారంలో ఉంటుంది.కేదార్‌నాథ్‌లో ఉన్న జ్యోతిర్లింగం శివుని 12 ప్రధాన జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.3584 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్‌నాథ్ ధామ్ శివునికి చాలా ఇష్టమైన ప్ర‌దేశం అని చెబుతారు.దీని తరువాత పూణేలోని సహస్త్రాది పర్వతంపై ఉన్న ఆరవ భీమశంకర్ జ్యోతిర్లింగానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.భీమశంకర జ్యోతిర్లింగాన్ని దర్శించడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.

Telugu Jyothirlingas, Jyothirlingam, Maha Shivaratri-Latest News - Telugu

12 జ్యోతిర్లింగాలలో ఒక‌టైన కాశీ విశ్వనాథునికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.క‌లియుగాంతం త‌రువాత కూడా కాశీ నిలిచి ఉంటుందని శాస్త్రాలలో చెప్పబడింది.ప్రళయకాల సమయంలో శివుడే కాశీ న‌గ‌రాన్ని కాపాడుతాడ‌ని న‌మ్ముతారు.12 జ్యోతిర్లింగాలలో మ‌రొకటి త్రయంబకేశ్వర‌ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది.గౌతమ ఋషి మరియు గోదావరి కోరిక మేరకు శివుడు త్రయంబకేశ్వరుని రూపాన్ని ధరించాడని చెబుతారు.జ్యోతిర్లింగాలలో తొమ్మిదవ స్థానంలో ఉన్న బైద్యనాథ్ జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో ఉంది.ద్వారకలో ఉన్న నాగేశ్వర్ జ్యోతిర్లింగం కూడా భ‌క్తుల విశ్వాస కేంద్రాలలో ఒకటిగా పరిగణిస్తారు.

రామేశ్వరం జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి.అలాగే చార్ ధామ్‌లలో ఒకటి.

రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని రాముడు స్థాపించాడు.అందుకే దీనికి రామేశ్వరం అని పేరు వచ్చింది.

మహారాష్ట్రలోని సంభాజీనగర్‌లోని ఘృష్ణేశ్వర్ ఆలయం 12వ జ్యోతిర్లింగంగా గుర్తింపు పొందింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube