రత్నాలు మెరిసే ప్రకృతి విలువైన బహుమతులు అని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు.ఈ రత్నాలు గ్రహా దోషాలను( Planetary Doshas ) తొలగించడమే కాకుండా శరీరక, మానసిక ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
ముఖ్యంగా చెప్పాలంటే అద్భుతమైన అర్ధ విలువైన రత్నం గోమేధికం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ రత్నం ధరించడం వల్ల మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా రకాల సమస్యలను దూరం చేస్తుంది.
మీ జీవితంలో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఈ రత్నాన్ని ధరిస్తే మీ ఆర్థిక పరిస్థితులను కూడా మెరుగుపరుస్తుంది.

అలాగే రాహువు( Rahu ) వల్ల మీ జీవితంలో ప్రతికూలత పెరిగిందని మీరు భావిస్తే కూడా ఈ రత్నాన్ని ధరించవచ్చు.ఈ సమయంలో ఈ రత్నాన్ని ధరించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే రాహు దోషం కూడా దూరమైపోతుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
అలాగే రాహువు మహాదశ లేదా అంతర్దశ తీవ్రమైన ప్రభావాలను కూడా ఇది నయం చేయగలదు.మీ వైవాహిక జీవితంలో మీకు సమస్యలు ఉంటే గోమేధికం రత్నం( gemstone ) ధరించడం వల్ల ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
ఈ రాయి మన జీవితంలో సానుకూల శక్తిని తెస్తుంది.

అలాగే మీరు ఇటీవల మీ భాగస్వామికి దూరంగా ఉంటే అది మీ వివాహంలో ప్రేమ, సామరస్యం, ఆనందాన్ని పెంచుతుంది.ఇది మీకు మీ భాగస్వామికి మధ్య ఏదైనా ప్రతికూలతను కూడా తగ్గిస్తుంది.దానివల్ల మీరు రాబోయే ప్రతి కష్టాన్ని ప్రశాంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు.
ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో కాలసర్ప దోషం ఉంటే అది జీవితం మొత్తన్ని నాశనం చేస్తుంది.ఇది జీవితంలో వాదనలు, తగాదాలు, ఉద్రిక్తత, ఆందోళన, తక్కువ ఆత్మగౌరవం, పేద అనారోగ్యం, ఆర్థిక నష్టాలు లాంటి ఎన్నో ప్రతికూలతను తెస్తుంది.
జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ రాయి తీవ్రమైన కాలసర్ప దోషాన్ని కూడా త్వరగా నయం చేయగలదు.అయితే ఈ దోషం దుష్ప్రభావాల నుండి త్వరగా ఉపశమనం పొందడానికి దీనిని ధరించే ముందు మంచి జ్యోతిష్యుడిని సంప్రదించడం ఎంతో మంచిది.